/rtv/media/media_files/2025/12/30/ukraine-denies-drone-attack-2025-12-30-18-16-48.jpg)
Ukraine denies drone attack on Putin's residence
ఉక్రెయిన్, రష్యా మధ్య నాలుగేళ్ల క్రితం మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడులు జరగినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. డిసెంబర్ 28 నుంచి 29 మధ్య పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపిస్తోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం పుతిన్‌తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. ఇరుదేశాల నాయకుల మధ్య సానుకూల సంభాషణలు జరిగినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు.
Also Read: 2026లో భారత్-పాక్ మధ్య యుద్ధం.. US షాకింగ్ రిపోర్ట్!
అయితే పుతిన్ ఇంటిపై దాడులు జరగడంపై ట్రంప్ కోపంతో ఉన్నారని పుతిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ తెలిపారు. సంభాషణ సమయంలో మేము జెలన్స్కీకి క్షిపణులు ఇవ్వలేదని ట్రంప్ అన్నట్లు చెప్పారు. ఇలాంటి పిచ్చి చేష్టలను తాను ఊహించలేదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఇటీవల ట్రంప్ ఫ్లోరిడాలో జెలెన్‌స్కీతో భేటీ అయిన సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగించేందుకు ఇరుదేశాల మధ్య దౌత్య ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. యుద్ధం విషయంలో తుది గడువు ఏమి లేదని అన్నారు. యుద్ధం ముగింపు పైనే తాము ఫోకస్ పెట్టినట్లు స్పష్టం చేశారు. ఇంతలోనే పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగినట్లు ఆరోపణలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: ఢిల్లీకి రక్షణ కవచంగా క్యాపిటల్ డోమ్ .. శత్రు దేశాలకు ఇక చుక్కలే
డిసెంబర్ 28న రాత్రి ఉక్రెయిన్ 91 లాంగ్ రేంజ్ డ్రోన్లతో పుతిన్ ఇంటిపై దాడులు చేసినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ తెలిపారు. దాడులు చేసిన కూడా శాంతి ఒప్పందాలను ఉపసంహరించుకోమని స్పష్టం చేశారు. అయితే శాంతి ప్రయత్నాలను పక్కదారి పట్టించేందుకే ఈ దాడులు చేశారని విమర్శించారు. ప్రతీకార చర్యల కోసం రష్యా లక్ష్యాలను ఎంచుకుందని వ్యాఖ్యానించారు. అయితే ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండిచారు. అమెరికా, ఉక్రెయిన్ చేసిన శాంతి ప్రయత్నాలను రష్యా ప్రమాదంలో పడేయాలని కోరుకుంటోందని తెలిపారు. కీవ్‌లోని అధికారిక నివాసంపై దాడి చేసేందుకు ఒక సాకు కోసం చూస్తున్నట్లు పేర్కొన్నారు.
Follow Us