/rtv/media/media_files/2025/02/07/hD1OwTrPRcuesdi432mn.jpg)
Kejriwal House
Delhi Election Updates: ఢిల్లీ ఎన్నికలు...మొదటి నుంచి వీటిపై హంగామా నడుస్తూనే ఉంది. ఆమ్ ఆద్మీ, బీజేపీ పార్టీల మధ్యా నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగుతోంది. ఆప్, బీజేపీలు ఒకరి మీద ఒకరు విపరీతంగా ఆరోపణలు చేసుకున్నారు. ఇవి కాస్తా ఈసీ వరకూ వెళ్ళడం..ఆందోళనలు జరగడం లాంటివి కూడా జరిగాయి. యమునా నదీ జలాల విషయంలో కేజ్రీవాల్ మీద కేసు కూడా నమోదైంది. ఇప్పుడు తాజాగా ఆయనకు ఏసీబీ నోటీసులు పంపించింది. నేడు ఫలితాలు వెలువడతాయి అనగా దేశ రాజధానిలో హై డ్రామా చోటు చేసుకుంది.
కేజ్రీవాల్ కు ఏసీబీ నోటీసులు...
ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎత్తుకుపోయేందుకు బీజేపీ చూస్తోందంటూ నిన్న కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇది పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఈ ఆరోపణలపై వెంటనే విచారణ చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏసీబీ తక్షణమే రంగంలోకి దిగింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ కు నోటీసులు పంపించింది. ఆరోపణలకు సంబంధించి ఆధారాలను చూపాలని ఏసీబీ అడిగింది. ఫోన్ కాల్ అందుకున్న ఆ 16మంది అభ్యర్థులు ఎవరు? వారికి వచ్చిన నంబర్లు, సంబంధిత సమాచారాన్ని అందించాలని తెలిపింది. దీంతోపాటు దిల్లీ ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేలా ఆరోపణలు చేస్తున్నందుకు చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని హెచ్చరించింది.
దీంతో కేజ్రీవాల్ ఇంటి ముందు కాసేపు హైడ్రామా నడిచింది. నోటీసులు ఇవ్వడానికి స్వయంగా ఏసీబీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏసీబీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆప్ నేతలు.. వారిని కేజ్రీవాల్ ఇంటిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎటువంటి లీగల్ నోటీసులు లేకుండా అధికారులు వచ్చారని, గంటన్నర తర్వాత నోటీసులు అందించారని ఆప్ లీగల్ సెల్ అధ్యక్షుడు సంజీవ్ నాసియార్ తెలిపారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోపణలు సరైనవేనని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. 16మంది కంటే ఎక్కువ మందిని ఆప్ నుంచి దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
Also Read: Central: కొత్త ఆదాయపు పన్నుకు కేంద్ర కేబినెట్ ఆమోదం