ఢిల్లీలో తీవ్ర కాలుష్యం.. కలుషిత వాటర్ బాటిల్‌తో ఎంపీ నిరసన

ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోవడంతో ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. అక్కడ ప్రజల ఇళ్లల్లో వస్తున్న కలుషిత నీటిని ఓ ప్లాస్టిక్ బాటిల్లో నింపారు. ఆ బాటిల్‌ను తీసుకొని ఢిల్లీ సీఎం అతిశీ నివాసం వద్ద పారబోశారు.

New Update
aap

ఢిల్లీలో ప్రస్తుతం గాలి నాణ్యత దిగజారిపోయిన సంగతి తెలిసిందే. అయితే దీపావళి సందర్భంగా బాణాసంచా నిషేధం ఉన్నప్పటికీ కూడా కొందరు టపాసులు పేల్చేశారు. దీంతో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు నల్లాల్లో కూడా కలుషిత తాగునీరు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. అక్కడ ప్రజల ఇళ్లల్లో వస్తున్న కలుషిత నీటిని ఓ ప్లాస్టిక్ బాటిల్లో నింపారు. ఆ బాటిల్‌ను తీసుకొని ఢిల్లీ సీఎం అతిశీ నివాసం వద్ద పారబోశారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలకు ఇదే నీరు వస్తోందని అన్నారు.  

Also Read: ఉగ్రవాదులకు సరైన బదులిస్తాం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

''సాగర్‌పూర్, ద్వారకలో గత కొద్దిరోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోంది. ఈ నీటిని అధికారులు తాగగలగా ? 15 రోజుల్లోగా సీఎం అతిశీ ఈ సమస్యను పరిష్కరించాలి. ప్రజలకు పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలి. లేకపోతే నిరసనలు చేస్తామని'' స్వాతి మాలివాల్ హెచ్చరించారు. ఇదిలాఉండగా.. మరోవైపు ఢిల్లీలో యమునా నది తీవ్ర కాలుష్యం ఉంది. ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, మురుగు నీటిని వదులుతుండటంతో యమునా నదిలో తెల్లటి నురగలు ప్రవహిస్తున్నాయి. కలుషితమైన నీటితో సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 

Also read: స్టాక్ మార్కెట్లోకి తెలుగు..మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్‌ఎస్‌ఈ

ఢిల్లీలో పెరిగిన కాలుష్యంపై ఇటీవల సీఎం అతిశీ మాట్లాడారు. హర్యనాలో పంట వ్యర్థాల దహనం, డీజిల్ బస్సులు, ఇటుక బట్టీల వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఢిల్లీ - ఘాజియాబాద్ సరిహద్దుల్లో కౌశాంబి బస్‌ డిపోకు వేలాది సంఖ్యలో బస్సులు వస్తున్నాయని తెలిపారు. ఎన్సీఆర్‌ ప్రాంతంలో ఇటుక బట్టీలు, థర్మల్‌ ప్లాంట్లు కూడా వాయు కాలుష్యానికి ఒక కారణమన్నారు. యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేయకపోవడంతో నదిలో నురగ ఏర్పడుతోందని మండిపడ్డారు. ఇక కాలుష్య నియంత్రణకు 10 వేల మంది సివిల్ డిఫెన్స్ వాలంటీర్లను నియమిస్తామని పేర్కొన్నారు. 


  

 

Advertisment
Advertisment
తాజా కథనాలు