NSE: స్టాక్ మార్కెట్లోకి తెలుగు..మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్‌ఎస్‌ఈ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కొత్తగా మొబైల్ యాప్‌ను లాంచ్ ఏసింది. తన వెబ్ సైట్ సేవలను మరింత మెరుగుపరుచుకునే విధంగా దీనిని రూపొందించింది. ప్రస్తుతం ఇంగ్లీషులో మాత్రమే ఉన్న ఈ యాప్ త్వరలో తెలుగుతో సహా 11 భాషల్లోకి అందుబాటులోకి రానుంది. By Manogna alamuru 02 Nov 2024 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి NSE Mobile App: ఎన్‌ఎస్‌ఈ...భారతదేశప స్టాక్ ఎక్స్ఛేంజ్. దీనిని ఎన్‌ఎస్‌ఈ అని కూడా అంటారు. ఇది ఇప్పుడు తన సేవలను విస్తృతం చేసింది. ఇపటివరకు ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు మొబైల్ యాప్ ను కూడా లాంఛ్ చేసింది ఎన్‌ఎస్‌ఈ. వెబ్‌సైట్‌లో కేవలం ఇంగ్లీషులో మాత్రమే కనిపించే ఎన్‌ఎస్‌ఈ...మొబైల్ యాప్‌లో మాత్రం తెలుగుతో సహా 11 భారతీ భాసల్లో కనిపించనుంది. దీంతో మదుపర్లు సలుభంగా డేటాను యాక్సెస్ ఏసే సదుపాయం లభించనుంది. ఎన్‌ఎస్‌ఈ మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటలోనూ పని చేస్తుంది. దీనివలన పెట్టుబడి దారులు సురక్షితమైన సమాచారాన్ని యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందులోనే ఇండెక్స్ ఓవర్‌వ్యూలు, మార్కెట్ అప్‌డేట్లు, ట్రేడింగ్ వాల్యూమ్‌లు, నిఫ్టీ50 పర్‌ఫార్మెన్స్ ఇండికేటర్లు, స్టాక్ సెర్చ్ క్యాపబులిటీస్, కస్టమైజ్డ్ వాచ్‌లిస్ట్స్.. ఇలా అన్ని విషయాఉ ఉండనున్నాయి. దీంతో పాటు ఆప్షన్ ట్రేడింగ్‌కు సంబంధించిన కాల్స్, పుట్స్.. లాంటి మొత్తం డేటా ఉంటుందని ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ఇది కూడా చదవండి: కేటీఆర్ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు ఎన్‌ఎస్‌ఈ మబైల్ యాప్ తెలుగుతో పాటూ అస్సాం, బెంగాలీ, కన్నడ, మలయాళం, ఒడియా, పంజాబీ, తమిళం, హిందీ, మరాఠీ, గుజరాత్ భాషల్లో ఉంటుంది. మదుర్లకు భాషా సంబంధమైన సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ యాప్ లాంఛ్ చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ చెబుతోంది. ఇది కూడా చదవండి: రష్యాపై ఉక్రెయిన్ క్షిపణుల దాడి.. జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి