/rtv/media/media_files/2025/07/19/app-with-india-blick-2025-07-19-12-13-29.jpg)
ఇండియా కూటమికి ఆమ్‌ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీతో ఆప్‌కు విభేదాలు వస్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా శనివారం ఆప్ ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పింది. ఇక నుంచి తాము విపక్ష కూటమిలో భాగం కాదని ప్రకటించింది. కూటమిని నడిపించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్రను ప్రశ్నించింది. ప్రస్తుతం దేశంలోని రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి ఇండియా కూటమి పార్టీలతో శనివారం సాయంత్రం ఆన్‌లైన్ సమావేశం జరగనున్న క్రమంలో ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ ప్రకటన చేశారు. ఇండియా కూటమి పొత్తు కేవలం లోక్‌సభ ఎన్నికల వరకే అని తెలిపారు.
BIG NEWS🚨 AAP officially exits the INDIA bloc.
— Political Views (@PoliticalViewsO) July 18, 2025
So finally, the opportunistic AAP-Congress alliance comes to an end.
Now AAP will focus on eroding Congress's base in Gujarat and Goa😂 pic.twitter.com/Vsux5PWZAd
మేము ఢిల్లీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశాం. అదే మాదిరి బీహార్ ఎన్నికల్లోనూ పోటీకి దిగుతాం. ఉప ఎన్నికల్లోనూ మాది అదే వైఖరి. ఇక నుంచి ఇండియా కూటమిలో ఆప్ భాగం కాదు. ప్రజా సమస్యలను లోక్‌సభలో మా పార్టీ గట్టిగా ప్రస్తావిస్తుంది.’ అని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. ‘ఇండియా కూటమి నాయకత్వం అంటే పిల్లలాట కాదు. ఎన్నికల తర్వాత కూటమిని విస్తరించడానికి ఏమన్నా ప్రయత్నం చేశారా?’ అని ప్రశ్నించారు.