Saiyami Kher: సయామీ ఖేర్‌కు అరుదైన గౌరవం..‘ఫేస్‌ ఆఫ్‌ ఐరన్‌మ్యాన్‌ ఇండియా’గా ఎంపిక

బాలీవుడ్‌ నటి, అథ్లెట్‌ సయామీ ఖేర్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను ‘ఫేస్ ఆఫ్ ఐరన్‌మ్యాన్‌ ఇండియా’గా ఐరన్‌మ్యాన్ ఇంటర్నేషనల్  కమిటీ ఎంపిక చేసింది. ఏడాది వ్యవధిలో రెండుసార్లు ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’ ట్రయథ్లాన్‌ పూర్తి చేసినందుకుగానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది.

New Update
A rare honor for Saiyami Kher

A rare honor for Saiyami Kher

Saiyami Kher : బాలీవుడ్‌ నటి, అథ్లెట్‌ సయామీ ఖేర్‌ (Saiyami Kher)కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను ‘ఫేస్ ఆఫ్ ఐరన్‌మ్యాన్‌ ఇండియా’గా ఐరన్‌మ్యాన్ ఇంటర్నేషనల్  కమిటీ ఎంపిక చేసింది. ఏడాది వ్యవధిలో రెండుసార్లు ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’ ట్రయథ్లాన్‌ పూర్తి చేసినందుకుగానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది. నవంబరు 9న గోవాలో జరగనున్న ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’ (Ironman 70.3) ట్రయథ్లాన్‌కు ఆమె అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. 

నయామీ ఖేర్‌ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పోటీల్లో ఒకటైన 'ఐరన్‌మ్యాన్ 70.3' ట్రయాథ్లాన్‌ను ఏడాది తిరిగేలోపే రెండుసార్లు పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2024 సెప్టెంబర్‌లో మొదటిసారి, 2025 జులైలో రెండోసారి ఆమె ఈ రేసును విజయవంతంగా ముగించారు. అయితే, తాను ఈ పోటీలో పాల్గొన్నది రికార్డుల కోసం కాదని, తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం కోసమేనని సయామీ స్పష్టం చేశారు.

ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ అంటే మాటలు కాదు. ఇందులో పాల్గొనేవారు ఒకే రోజు వరుసగా 1.9 కిలోమీటర్లు ఈత కొట్టాలి, 90 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి, ఆ తర్వాత 21.1 కిలోమీటర్లు పరుగు పెట్టాలి. ఇంతటి కఠినమైన రేసును పూర్తి చేయడానికి అసాధారణమైన శారీరక, మానసిక స్థైర్యం అవసరం.  ‘ఐరన్‌మ్యాన్‌ 70.3’ పోటీని ‘హాఫ్‌ ఐరన్‌మ్యాన్’గా కూడా  పిలుస్తారు. ఈ రేసును ‘ప్రపంచ ట్రయథ్లాన్‌ కార్పొరేషన్‌’ ప్రతి ఏటా నిర్వహిస్తుంది. గతేడాది సెప్టెంబరులో తొలిసారిగా ఐరన్‌మ్యాన్‌ 70.3 మెడల్‌ అందుకున్నారు సయామీ.. ఈ ఏడాది జులైలో స్వీడన్‌లో నిర్వహించిన పోటీలో కూడా తన సత్తా చాటి మరో పతకం అందుకున్నారు. తక్కువ సమయంలో రెండు సార్లు ట్రయథ్లాన్‌ను పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా ఆమె రికార్డు నెలకొల్పింది. 

ఈ సందర్భంగా సయామీ ఖేర్ మాట్లాడుతూ... "ఐరన్‌మ్యాన్ ఇండియాకు ప్రచారకర్తగా ఉండటం నాకు దక్కిన గౌరవం. అభిరుచి, నిలకడ, వదిలిపెట్టని పట్టుదల వంటి నేను నమ్మే విలువలన్నిటికీ ఈ ప్రయాణం ఒక ప్రతీక. ఏడాదిలో రెండుసార్లు ఈ రేసును పూర్తిచేయడం రికార్డుల కోసం కాదు, నా పరిమితులను నేను సవాలు చేసుకోవడం కోసం చేశాను" అని తెలిపారు."ఈత కొట్టే ప్రతిసారి, సైకిల్‌పై ఎత్తుకు వెళ్తున్నప్పుడు, పరుగులో వేసే ప్రతి అడుగు.. మనిషి శరీరం, మనసు ఎంత శక్తిమంతమైనవో నాకు గుర్తు చేశాయి. నాకు ఐరన్‌మ్యాన్ అంటే కేవలం ఒక రేసు కాదని, అదొక జీవన విధానం అని సయామీ ఖేర్ స్పష్టం చేశారు. క్రీడల్లో అయినా, నటనలో అయినా ఎల్లప్పుడూ నా హద్దులను చెరిపేయడానికి ప్రయత్నిస్తాను. నా ప్రయాణం మరింత మంది భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను" అని సయామీ పేర్కొన్నారు.

 సయామీ ఖేర్ ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోవైపు క్రీడారంగంలో కూడా రాణిస్తున్నారు. రేయ్ (Rey)అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హిందీ,మరాఠీ సినిమాల్లో కూడా నటించింది. ఇక తెలుగులో రేయ్ మూవీ తర్వాత నాగార్జున వైల్డ్ డాగ్(Wild Dog), ఆనంద్ దేవరకొండ తో హైవే లో నటించింది. చివరిగా ఈ హీరోయిన్ బాలీవుడ్లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన జాట్ (Jaat)మూవీలో మెరిసింది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్,అక్షయ్ కుమార్ కాంబోలో వస్తున్న హైవాన్(Haiwaan) మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. సయామీ ఖేర్ ఇటీవల 'స్పెషల్ ఆప్స్ 2' వెబ్ సిరీస్‌లో కూడా ఒక  కీలక పాత్రలో కనిపించారు. కేకే మేనన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‌లో ఆమె సయామీ ఖేర్ కు మంచి ప్రశంసలు దక్కాయి.

Also Read :  ఈవారం ఓటీటీలో సందడే సందడి.. వార్2, మిరాయ్ సహా మొత్తం ఎన్నంటే?

Advertisment
తాజా కథనాలు