Saifullah Kasuri : భారత్ నన్ను చూసి భయపడుతోంది...ఓ పాక్ ఉగ్రవాది మదం మాటలు

లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్, పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరీ మరోసారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పాకిస్థానీ సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని తన వ్యాఖ్యల ద్వారా అతడు బయట పెట్టాడు.

New Update
FotoJet - 2026-01-11T205401.675

Lashkar-e-Taiba Deputy Chief Saifullah Kasuri

Saifullah Kasuri : భారతదేశం చేతిలో పాకిస్థాన్‌ ఎన్ని చావు దెబ్బలు తిన్న తన అహంకారాన్ని తగ్గించుకోవడం లేదు. తాజాగా పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్, పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరీ మరోసారి భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. పాకిస్థానీ సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని తన వ్యాఖ్యల ద్వారా అతడు బయట పెట్టాడు. వారి మధ్య ఉన్న సంబధాన్ని అతడు బహిరంగంగానే అంగీకరించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

 ఇటీవల పాకిస్థాన్‌లోని ఒక పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి కసూరీ ప్రసంగించాడు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులకు ఇండియాపై ద్వేషాన్ని నూరిపోశాడు. "పాకిస్థాన్ సైన్యం నన్ను గౌరవంగా ఆహ్వానిస్తుంది. మరణించిన పాక్ సైనికుల అంతిమ సంస్కారాల్లో ప్రార్థనలు (నమాజ్) చేయడానికి నన్ను పిలుస్తారు. భారత్ కూడా నన్ను చూసి భయపడుతోంది" అంటూ అతడు అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల చిన్న పిల్లల మనసుల్లో చిన్నతనం నుంచే తీవ్రవాదాన్ని నింపేలా అతడు చేసిన ఈ ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడం గమనార్హం.

కాగా, చాలా కాంగా  పాక్ సైన్యానికి ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం లేదని ఆ దేశం అంతర్జాతీయ వేదికలపై ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ.. కసూరీ వ్యాఖ్యలతో అది అబద్ధం  అని మరోసారి బట్టబయలైంది. ఉగ్రవాదులు సైనికుల అంతిమ సంస్కారాల్లో పాల్గొనడం, సైన్యం వారిని అధికారికంగా ఆహ్వానించడం చూస్తుంటే.. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థలు కుమ్మక్కయ్యాయనే విషయం స్పష్టమవుతోంది. భారత్ ఎప్పటి నుంచో చెబుతున్న 'స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం' (ప్రభుత్వ ప్రోత్సాహంతో నడిచే ఉగ్రవాదం) నిజమేనని కసూరీ మాటలతో రుజువైంది.

కాగా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన "ఆపరేషన్ సింధూర్" వల్ల లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్ వంటి సంస్థలు భారీగా దెబ్బతిన్నాయి. అయితే తాజా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం.. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి ఈ సంస్థలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిధుల సేకరణ, కొత్త ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ ద్వారా భారత్‌పై మరోసారి మెరుపు దాడులు చేసేందుకు అవి కుట్రలు పన్నుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్ద ఎత్తున తీవ్రవాదులను రిక్యూట్‌ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు