Current Bill: సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలకు నెలవారికి కరెంటు బిల్లు రూ. 500, రూ.1000 లేదా రూ.2 వేలు వస్తుంది. ఇక పరిశ్రమలు, వివిధ కంపెనీల్లో చూసుకుంటే నెలకు లక్షల్లోనే కరెంటు బిల్లు ఉంటుంది. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యాపారికి ఏకంగా రూ.210 కోట్లకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో అతడు అవాక్కయిపోయాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Also Read: "స్క్విడ్‌గేమ్" సూట్‌లో టాప్ పొలిటికల్ లీడర్స్.. వీడియో వైరల్ టెక్నికల్ లోపం జరగడం వల్లే ఇలా.. హమీర్పూర్ జిల్లా జట్టాన్ అనే గ్రామానికి చెందిన లలిత్ ధిమాన్ అనే వ్యాపారికి ప్రతినెలా రూ.3 వేల లోపే కరెంట్ బిల్లు వస్తుండేంది. తాజాగా విద్యుత్ అధికారులు ఇచ్చిన కరెంట్ బిల్లులో రూ.210,42,08,405 ఉండటం చూసి కంగుతిన్నాడు. ఆ తర్వాత విద్యుత్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎలక్ట్రీసిటీ బిల్లు రికార్డులను పరిశీలించిన తర్వాత టెక్నికల్ లోపం జరగడం వల్లే ఇలా జరిగిందని అధికారులు తెలిపారు. బిల్లు రూ.210 కోట్లు కాదని.. రూ.4,047 అని సవరించడంతో లలిత్ ధిమాన్ ఊపిరి పీల్చుకున్నారు. Also Read: అవినీతిని ప్రశ్నించాడని సర్పంచ్‌ను చంపించిన మంత్రి.. అతను అరెస్ట్! గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. 2024లో గుజరాత్‌లోని వల్సాద్ అనే ప్రాంతంలో టైలరింగ్ నడిపే అన్సారీ అనే వ్యక్తికి కూడా ఏకంగా రూ. 86 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదు చేయగా.. అతని దుకాణానికి చేరుకున్న అధికారులు మీటర్‌ను పరిశీలించారు. సాంకేతిక లోపం వల్లే రెండు సంఖ్యలు అదనంగా రావడంతో బిల్లు లెక్క తప్పుగా వచ్చిందని చెప్పారు. Also Read: యూపీలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య Also Read: నిమిషానికి 4 లక్షల బులెట్లతో చైనా కొత్త గన్.. డేంజర్లో అగ్రరాజ్యం!