/rtv/media/media_files/2025/05/27/kokatc7aJctf2Eb313Yd.jpg)
crime news
Crime News : హర్యానాలోని పంచకులలో సంచలనం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో ఏడు మృతదేహాలు లభించడం స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా ఈ ఏడు మృతదేహాలు కూడా ఒకే కుటుంబానికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. వారంతా కూడా స్థానికంగా ప్రముఖ వ్యాపారిగా గుర్తింపు పొందిన ప్రవీణ్ మిట్టల్ కుటుం సభ్యులుగా తెలుస్తోంది. అయితే వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్యచేసి వారి శవాలను కారులో పెట్టి అక్కడ వదిలేశారా? అనే విషయం సస్పెన్స్‌గా మారింది.
Also Read: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)
Seven Bodies In Side Parking Car
కాగా ప్రవీణ్ మిట్టల్ కుటుంబం డెహ్రాడూన్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. వీరంతా సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారం సాగుతోంది. పంచకులలోని సెక్టార్ 27లోని ఒక ఇంటి వెలుపల రోడ్డుపై ఆపి ఉంచిన కారులో బాధితులందరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ కుటుంబమంతా కారులోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. భారీ అప్పులు, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
VIDEO | Panchkula, Haryana: Seven members of a family from Dehradun found dead inside a car. Police investigating the case.
— Press Trust of India (@PTI_News) May 27, 2025
DSP Panchkula Himadri Kaushik says, "Our forensic team has reached the spot. We are analysing... scanning the car thoroughly to know the reasons behind the… pic.twitter.com/IetVgT6ojz
మృతులను డెహ్రాడూన్ నివాసి ప్రవీణ్ మిట్టల్ (42) గా గుర్తించారు, మృతుల్లో అతని తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు. సంఘటనా స్థలం నుండి పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు, అయితే దానిలోని విషయాలు ఇంకా వెల్లడించలేదు. ఈ విషయం ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. ఏడు మృతదేహాలను పంచకులలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
ఇది కూడా చూడండి: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్, డీసీపీ (శాంతిభద్రతలు) అమిత్ దహియా సంఘటనా స్థలానికి చేరుకుని సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని తదుపరి విశ్లేషణ కోసం ఆధారాలను సేకరించింది. "మా ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. కారు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి మేము పరిశీలిస్తున్నాము. ప్రాథమిక సమాచారం మేరకు దీన్ని ఆత్మహత్యగా భావిస్తున్నామని" పంచకుల డీఎస్పీ హిమాద్రి కౌశిక్ అన్నారు.ఈ విషాద సంఘటన స్థానికుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రస్తుతం, పంచకుల పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Also read: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
Also Read : ఒడ్డుకు కొట్టుకొస్తున్న కంటెయినర్లు..కేరళ తీరం వెంబడి హై అలెర్ట్
dead-bodies | family suicide for financial incident | Family Suicide For Financial | family-suicide