ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది మరణించడం కలకలం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలంలోనే కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బలరాంపూర్ జిల్లా రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధా బాగీచా ప్రధాన రహదారిపై ఓ మలుపు వద్ద ఎస్‌యూవీ వాహనం అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.
Also Read: జమిలీ ఎన్నికలపై విజయ్ పార్టీ సంచలన ప్రకటన
ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులు లారిమా అనే ప్రాంతం నుంచి పొరుగున ఉన్న సూరజ్‌రాజ్ జిల్లాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతివేగం వల్లే వాహనం కంట్రోల్ తప్పి చెరువులోకి దూసుకెళ్లినట్లు పేర్కొన్నారు. చివరికి చెరువులో పడ్డ ఆ వాహనాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మృతుల్లో ఓ మహిళ, మరో చిన్నారి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు
ఇదిలాఉండగా.. ఇటీవల తమిళనాడులోని హోసూర్ సమీపంలో కూడా ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ ఐటీ ఉద్యోగితో పాటు ముగ్గురు మృతి చెందారు. గురువారం ఈ ముగ్గురు రాత్రి హోసూరు సమీపంలో ఉన్న పాకలూరు వైపుగా వెళ్లారు. అలా వెళ్తుండగా.. వెంకటాపురం చెరువు ఒడ్డున అకస్మాత్తుగా కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
Also Read: ఇందిరమ్మ ఇళ్ల స్థలాలపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన..