/rtv/media/media_files/2026/01/14/cm-revanth-responds-on-ntv-issue-2026-01-14-17-50-00.jpg)
CM Revanth Responds on NTV Issue
తెలంగాణ మంత్రి , ఓ మహిళా IAS అధికారిని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసిన NTV జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ఆ ఛానల్ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ ఎన్టీవీపై సీరియస్ అయ్యారు. ఆ ఛానల్ లైసెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర సమాచార శాఖకు లేఖ రాయాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: పండుగ పూట దారుణం.. చైనా మాంజాతో గొంతు తెగి వ్యక్తి మృతి
బూతు కథనాన్ని సోషల్‌మీడియాలో ప్రచారం చేసినవారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారానికి మద్దతిస్తున్న BRS, YCPలకు సరైన సమాధానం ఇవ్వాలని పార్టీ వర్గాలకు ఆదేశించారు. NTVకి మద్దతుగా మాట్లాడిన జగ్గారెడ్డిపై కూడా రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. ఈ బూతు వార్త కథనం వెనుకున్నవారు ఎంతవారైనా అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలాఉండగా ఓ మంత్రి, మహిళా ఏఐఎస్ అధికారినికి సంబంధం ఉందంటూ NTV వార్త కథనం ప్రచారం చేసింది. దీనిపై స్పందించిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. NTV న్యూస్ ఛానల్ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ లేఖను విడుదల చేసింది. కష్టపడి సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన మహిళా అధికారుల పట్ల ఇలాంటి కథనాలు ప్రచారం చేయడం వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ధ్వజమెత్తింది. ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు NTV జర్నలిస్టులను అరెస్టు చేశారు.
Follow Us