/rtv/media/media_files/2026/01/13/chips-2026-01-13-21-52-50.jpg)
ఒడిశా లో ఒక సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బలంగీర్ జిల్లాలోని పట్నాగఢ్‌లో, చిప్స్ ప్యాకెట్‌లో దొరికిన బొమ్మ ఒక చిన్నారి జీవితాంతం దుఃఖాన్ని మిగిల్చింది. ఆ బొమ్మ చిన్నారికి ఒక కంటి చూపును కోల్పోయేలా చేసింది. ఆదివారం సాయంత్రం టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బాధితుడు 3వ తరగతి విద్యార్థి. షాగడ్‌ఘాట్ గ్రామానికి చెందిన లాబ్ హర్పాల్ కుమారుడు ఇతను.
ఈ చిన్నారి ఒక దుకాణం నుండి ఐదు రూపాయల లైట్‌హౌస్ మొక్కజొన్న ప్యాకెట్‌ను కొనుక్కున్నాడు. ఆ ప్యాకెట్‌లో చిప్స్ తో పాటూ ఒక బొమ్మ కూడా ఉంది. సాధారణంగా పిల్లలను ఆకర్షించడానికి ఇలా బొమ్మలను పెడుతుంటారు. కిండర్ జాయ్ వంటి చాకెట్లలో కూడా ఇవి మనకు కనిపిస్తుంటాయి. అలా ఆ చిప్స్ పేకెట్ లో దొరికిన బొమ్మతో పిల్లాడు ఆడుకుంటూ మంటల్లో విసిసేశాడు. అందులో ఏముందో ఏమో తెలియదు కానీ...నిప్పుల్లో వేయగానే ఒక్కసారి భారీ పేలుడు సంభవించింది. అది చాలా పెద్దగా జరగడంతో..నిప్పుల్లో ఉన్న పదార్థాలు బాలుడి కంటికి నేరుగా వచ్చి తగిలాయి. దీంతో బాబు కనుపాప ఏకంగా చలిపోయింది గాయపడిన పిల్లాడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. పిల్లాడి కన్ను శాశ్వతంగా దెబ్బ తిందని...దానిని బాగు చేయలేమని వైద్యులు చెప్పారు.
వాటి ఉత్పత్తులను ఆపేయాలి..
ఈ సంఘటన తర్వాత పిల్లాడి తల్లిదండ్రులు టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చిప్స్ ప్యాకెట్ అమ్మిన వారు, తయారీదారులపై ఎఐఆర్ నమోదు చేశారు. చిప్స్ ప్యాకెట్ లో బొమ్మ చాలా ప్రమాదకరమైనదని...అలాంటివి తినుబండారాల్లో ఎలా పెడతారని పిల్లాడి తలిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటలను మరిన్ని జరగకుండా...ఆ చిప్స్ ప్యాకెట్ ఉత్పత్తులను నిరోధించాలని కోరారు. తమ పిల్లాడు ఇంత చిన్న వయసులో చూపు కోల్పోవడాన్ని తాము భరించలేకపోతున్నామని పేరెంట్స్ చెబుతున్నారు.
Follow Us