India Alliance: ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిదే అధికారం: యాక్సిస్ మై ఇండియా

యాక్సిస్ మై ఇండియా ఝార్ఖండ్‌కు సంబంధించి పోల్ సర్వే విడుదల చేసింది. ఈ సర్వేలో ఇండియా కూటమి వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు తేలింది. ఎన్డీయే కూటమికి 25 సీట్లు, ఇండియా కూటమికి 53, ఇతరులు 3 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది.

New Update
vooo

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ వెలువడుతున్నాయి. మెజార్టీ పోల్‌ సర్వేలు.. మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. ఇక ఝార్ఖండ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చిచెప్పాయి. మొత్తంగా మెజార్టీ సర్వేలు రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నాయి.

Also Read: మహాయుతి కూటమిదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలన లెక్కలివే!

Axis My India Poll Survey

అయితే తాజాగా యాక్సిస్ మై ఇండియా ఝార్ఖండ్‌కు సంబంధించి పోల్ సర్వే విడుదల చేసింది. ఈ సర్వేలో ఇండియా కూటమి వైపే ఓటర్లు మొగ్గుచూపినట్లు తేలింది. ఎన్డీయే కూటమి 17-27 సీట్లు, ఇండియా కూటమికి 49-59, జేఎల్‌కేఎం 1-4, ఇతరులు 0-2 స్థానాల్లో యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌ ఎన్డీయే కూటమి గెలుస్తుందని చెప్పగా.. యాక్సిస్ మై ఇండియా విభిన్నంగా చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఇది కూడా చూడండి: వరంగల్‌లో అఘోరి ప్రత్యక్షం.. శ్మశాన వాటికలో పడుకుని వింత పూజలు!

ఇది కూడా చూడండి: అసలు మీ సమస్య ఏంటి? ట్రోలర్స్ కు కుల్దీప్ స్ట్రాంగ్ కౌంటర్‌!

మరోవైపు తామంటే తామే గెలుస్తామని ఎన్టీయే, ఇండియా కూటమిల నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. మరికొందరు ఎగ్జిట్ పోల్స్‌ వైపు కాకుండా.. ఫలితాల రోజు ఎవరు గెలుస్తారో తెలుస్తుందని చెబుతున్నారు. ఇదిలాఉండగా.. బుధవారం మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో పోలింగ్‌ ముగిసిన సంగతి తెలిసిందే.   

ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు