Canada: కెనడాలో దారుణం.. 17 మంది భారతీయ విద్యార్థులు మృతి

ఈ మధ్య కాలంలో విదేశాల్లో భారతీయ విద్యార్థులు చనిపోతున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక విషయం వెల్లడించింది. గడిచిన ఏడేళ్లలో కెనడాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులు మృతి చెందినట్లు తెలిపింది.

New Update
17 Indian students killed in violent incidents in Canada since 2018, Says Central govt

17 Indian students killed in violent incidents in Canada since 2018, Says Central govt

ఈ మధ్య కాలంలో విదేశాల్లో జరుగుతున్న హింసాత్మక దాడుల్లో భారతీయ విద్యార్థులు చనిపోతున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక విషయం వెల్లడించింది. గడిచిన ఏడేళ్లలో అంటే 2018 నుంచి 2025 వరకు కెనడాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులు మృతి చెందినట్లు తెలిపింది. ఆ తర్వాత అమెరికాలో 9, ఆస్ట్రేలియా 3, కిర్గిస్థాన్‌లో ఇద్దరు చనిపోయినట్లు తెలిపింది. అలాగే బ్రిటన్, జర్మనీ, చైనా, డెన్మార్క్, గ్రెనడాలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. 

Also Read: ఆన్‌లైన్‌లో డబ్బులు పోగట్టుకున్న వారికి గుడ్‌న్యూస్.. వారికి బ్యాంక్‌ నుంచి రూ.25వేలు

భారతీయ విద్యార్థులపై విదేశాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ లోక్‌సభలో ప్రశ్నించారు. వీటిపై ప్రభుత్వానికి అవగాహన ఉందా ? సకాలంలో విచారణ చేస్తున్నారా ? అని అడిగారు. ఈ క్రమంలోనే విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ ఈ ప్రశ్నలకు సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. విదేశాల్లో భారతీయ విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వాళ్లపై జరిగే దాడులు, హింసాత్మక ఘటనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.  

Also Read: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం.. అగ్ని-3 మిస్సైల్ టెస్ట్ సక్సెస్

Advertisment
తాజా కథనాలు