/rtv/media/media_files/2025/10/13/rjd-2025-10-13-12-30-16.jpg)
2 RJD MLAs Resign From Assembly Ahead Of Bihar Polls, May Join JDU
మరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార NDA, విపక్ష మహాగఠ్ బంధన్ కూటమిలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నవాడా నియోజకవర్గం ఎమ్మెల్యే విభా దేవీ, అలాగే రాజౌలీ ఎమ్మెల్యే ప్రకాశ్ వీర్ ఆదివారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. వీళ్లిద్దరూ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Also Read: కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
స్పీకర్ కూడా వాళ్ల రాజీనామాను ఆమోదించారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 22న గయాజీలో ప్రధాని మోదీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీళ్లు ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం ఉందనే ప్రచారం నడిచింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన కొన్ని రోజులకు వీళ్లు తమ పదవులకు రాజీనామా చేశారు.
Also Read: నువ్వేం తండ్రివి రా.. భార్య విడిచి వెళ్లిందనే కోపంతో ముగ్గురు పిల్లలను గొంతు కోసి హత్య
విభా దేవి భర్త రాజ్ బల్లాబ్ యాదవ్ కూడా మాజీ ఎమ్మెల్యే. ఈయన పోక్సో కేసు కింద కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆర్జేడీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో అప్పటి నుంచి విభా దేవి కూడా ఆర్జీడీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రాజీనామా చేశారు. ఇదిలాఉండగా ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి రెండుసార్లు ప్రకాశ్ వీర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో విభేదాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఆయన కూడా తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలు RJDకి రాజీనామా చేయడం ప్రస్తుతం అక్కడి రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.