Delhi Bomb Blast: కారు సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి..డ్రైవర్ వైద్యుడిగా గుర్తింపు

ఎర్రకోట దగ్గరలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాంబు దాడికి ఉపయోగించిన ఐ20 కారుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు కనుగొన్నారు. దీనిని ఒక డాక్టర్ నడిపినట్లు గుర్తించారు.

New Update
i 20 car

ఢిల్లీ పేలుడుకి, ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు లింక్ ఉన్నట్లు ఆధారాలు బయటపడుతున్నాయి. తాజాగా ఢిల్లీ పేలుడుకి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇందులో భాగంగా పేలుడుకి కారణమైన ఐ20 కారుకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని కనుగొన్నారు. సోమవారం సాయంత్రం 6:52 గంటలకు జరిగిన పేలుడుకు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు. కారు నడుపుతున్న వ్యక్తి డాక్టర్ మహ్మద్ ఉమర్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతకు ముందు కారును ఎర్రకోట దగ్గరలో పార్కింగ్ లో దాదాపు మూడు గంటలపాటూ ఉంచినట్లు కనుగొన్నారు. సోమవారం మధ్యాహ్నం 3:19 గంటలకు అక్కడికి వచ్చిన కారు.. సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉందని అధికారులు తెలిపారు. హెచ్‌ఆర్‌ 26సీఈ 7674 నంబర్‌ ప్లేటు గల కారును చివరి సారిగాపుల్వామాకు చెందిన తారీఖ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాంబు బ్లాస్ లో వాడిన కారుపై పలు ట్రాఫిక్‌ చలానాలు ఉన్నట్లు తేలింది. ఇందులో దిల్లీఎన్సీఆర్‌ ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటినీ క్లియర్‌ చేసినట్లు రికార్డులు చూపిస్తున్నాయి.

ఫరీదాబాద్ మాడ్యూల్ తో సంబంధాలు..

మరోవైపు ఢిల్లీ బాంబు పేలుడుకి, ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు మధ్య ఉన్న సంబంధాలు కూడా బయటపడుతున్నాయి. ఇక్కడ బాంబు పేలుడులో వాడిన పదార్ధాలు, ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్ధాలు ఒక్కటేగా ఉన్నాయి. దానికి తోడు అక్కడ వైద్యులను అనుమానితులుగా పట్టుకున్నారు. ఢిల్లీలో కూడా కారును నడుపుతున్న వ్యక్తి వైద్యుడిగా గుర్తించారు. దీంతో వీరందరూ ఒకే సంస్థకు చెందిన మనుషులుగా అనుమానిస్తున్నారు.

ఫరీదాబాద్ లో నిషేధిత జైషే మహ్మద్, అన్సార్‌ గజ్‌వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. అదీల్‌ అహ్మద్, ముజమ్మిల్ షకీల్, షాహిన్‌ ల దగ్గర నుంచి పలుడుకు సంబంధించిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు మహిళ కావడం గమనార్హం. హరియాణాలోని ఫరీదాబాద్ లో పేలుడికిసబంధించి అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్‌ సహా సల్ఫర్‌తో కూడిన పేలుడు పదార్థాలు భారీ ఎత్తున పోగుచేశారు. ఇది దాదాపు 3 వేల కేజీలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

Also Read: Delhi Blast: ఢిల్లీ బాంబు పేలుడు..మూడు నెల్లకో బ్లాస్ట్..జైషే మొహమ్మద్ ప్లాన్

Advertisment
తాజా కథనాలు