/rtv/media/media_files/2025/10/08/bjp-2025-10-08-17-17-57.jpg)
15 Seats Or Won't Contes, BJP Ally's Big Warning Ahead Of Bihar Elections
మరికొన్ని రోజుల్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఇంకో నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికారిక ఎన్డీయే, విపక్ష మహాగఠ్‌బంధన్ కూటములు ప్రచారాలు మొదలుపెట్టేశాయి. అలాగే సీట్లపై కూడా చర్యలు జరుగుతున్నాయి.
Also Read: ముంబైలో మొట్ట మొదటి డిజిటల్ ఎయిర్‌పోర్ట్.. దీని ప్రత్యేకతలివే!
అయితే బీజేపీ మిత్రపక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) కీలక ప్రతిపాదన చేసింది. పార్టీ చీఫ్ జీతన్ రామ్ మాంఝీ తమకు 15 సీట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. '' రాష్ట్రంలో మా పార్టీకి గుర్తింపు ఉండాలంటే మాకు గౌరవప్రదమైన సీట్లు అవసరం. అందుకే ఈసారి మేము 15 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మేము కోరిన సీట్లు ఇవ్వకుంటే ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయము. కానీ NDAలో మాత్రం కొనసాగుతాం. నేను సీఎం కావాలని అడగడం లేదు. మా పార్టీకి గుర్తింపు కావాలని కోరుతున్నామని'' జీతన్ రామ్ మాంఝీ అన్నారు. ఈ విషయాన్ని ఆయన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా చెప్పినట్లు సమాచారం. అయితే HAMకు అన్ని సీట్లు కేటాయించే ఛాన్స్ లేదనే ప్రచారం నడుస్తోంది. దీంతో జీతన్ రామ్‌ను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఇదేం దిక్కుమాలిన కంపెనీరా.. దీపావళి పార్టీకి ఒక్కో ఉద్యోగి నుంచి రూ.12 వందలు వసూలు!
ఇదిలాఉండగా అధికార NDA కూటమిలో బీజేపీ, జేడీయూ, హిందుస్థానీ అవామ్ మోర్చా, లోక్‌జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ ఉన్నాయి. అయితే HMAకు ఏడు సీట్లు, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీకి ఆరు సీట్లు ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమిలో కీలకంగా ఉన్న జేడీయూ పార్టీ, బీజేపీ సమానంగా సీట్లు తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రెండు పార్టీలు చెరో 100 స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక నవంబర్ 6,11 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి ఎవరు బీహార్‌లో అధికారంలోకి వస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.