/rtv/media/media_files/2025/10/08/diwali-2025-10-08-15-23-16.jpg)
పండగలకు కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు,గిప్ట్ లు లేదంటే తక్కువలో తక్కువగా స్వీట్ బాక్సులు ఇస్తుంటాయి. అయితే ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. వెరైటీగా ఒక కంపనీ ఉద్యోగులనే దీపావళి పండగ పార్టీకి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. నమ్మడానికి ఇది కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఇందుకు సంబంధించి ఒక వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై యూజర్లు మండిపడుతున్నారు.
కంపెనీ తమ ఉద్యోగులు దీపావళి పార్టీ కోసం ఒక్కొక్కరుగా రూ.1,200 చెల్లించాలని కోరింది. టీమ్ లీడ్‌లు అయితే రూ.2,000 చెల్లించాల్సి ఉంటుందని ఆ స్క్రీన్‌షాట్ మెసేజ్‌లో ఉంది. ఇది చాలాదు అన్నట్లుగా దీపావళి పార్టీకి తప్పకుండ హాజరు కావాలని ఆ మెసేజ్‌లో స్పష్టంగా రాసి ఉంది.దీంతో కంపెనీ తీరుపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "బోరింగ్‌గా ఉండే పార్టీకి డబ్బులు అడగడమే కాకుండా, హాజరు కావడం కూడా తప్పనిసరి చేయడం ఏంటి?" అని చాలా మంది ప్రశ్నించారు. ఈ విషయం భారతీయ కార్పొరేట్ సంస్కృతిపై చర్చకు దారితీసింది. దీనిపై చాలా మంది వినియోగదారులు కంపెనీ తన సొంత ఖర్చుతో కాకుండా ఉద్యోగుల నుండి డబ్బు అడగడం పట్ల ఆశ్చర్య, కోపాన్ని వ్యక్తం చేశారు. అలాగే, కార్యాలయ సంభాషణల కోసం WhatsApp ఉపయోగించడం వృత్తిపరమైన సరిహద్దులను దాటవేయడం అవుతుందని కొందరు అభిప్రాయపడ్డారు.
అధికారికంగా సెలవు దినం
మరోవైపు యూఎస్‌లోని మరో రాష్ట్రం దీపావళిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించింది. కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని భారతీయులకు సంతోషాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. దీంతో పెన్సిల్వేనియా, న్యూయార్క్ తర్వాత దీపావళిని సెలవు రోజుగా గుర్తించిన మూడో యూఎస్ రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. ఈ నిర్ణయం వల్ల కాలిఫోర్నియాలోని భారతీయ సంతతి ప్రజలు ఎటువంటి పని ఒత్తిడి లేకుండా పండుగను ఘనంగా జరుపుకునే అవకాశం లభిస్తుంది. ఫిజీ, మలేషియా, నేపాల్, శ్రీలంక, సింగపూర్ తదితర దేశాల్లోనూ దీపావళి రోజున సెలవు ఉంది.