Amazon Layoffs: ఐటీ ఉద్యోగులకు షాక్‌.. అమెజాన్‌లో భారీగా లేఆఫ్‌లు

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్ గత నెలలో 14 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో ఆ సంస్థలో ఉన్న దాదాపు అన్ని విభాగాలపై లేఆఫ్స్‌ ప్రభావం పడింది.

New Update
14,000 layoffs in amazon

14,000 layoffs in amazon

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ(Ecommerce Company) అమెజాన్ గత నెలలో 14 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు(Amazon Layoffs) ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో ఆ సంస్థలో ఉన్న దాదాపు అన్ని విభాగాలపై లేఆఫ్స్‌ ప్రభావం పడింది. క్లౌడ్‌ సర్సీసెస్‌, రిటెయిల్, డివైజెస్, అడ్వర్టైజింగ్, గ్రాసరీస్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నష్టపోయారు. ఎక్కువగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఉద్యోగాలే పోయాయని తాజాగా పలు నివేదికలు వెల్లడించాయి.  

Also Read: రెండేళ్ల నుంచే ఉగ్రదాడులకు ప్లాన్.. పేలుళ్ల కేసులో సంచలన నిజాలు

14,000 Layoffs In Amazon

అమెరికాలోని వాష్టింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్ర్రాల్లో వర్క్  వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ఫైలింగ్స్‌ దీనికి సంబంధించి పలు విషయాలు వెల్లడించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో 4700 ఉద్యోగాలను తొలగించారు. ఇందులో దాదాపు 1800 అంటే 40 శాతం ఇంజినీర్లే ప్రభావితమయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో మరో రౌండ్‌లో కూడా లేఆఫ్స్‌ ఉండే ఛాన్స్ ఉందని మరికొన్ని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఉద్యోగం పోతుందో అని తెలియక భయంతో పనిచేయాల్సిన పరిస్థితి వస్తోంది. 

Also Read: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు ట్రంప్ 28 సూత్రాల ప్రణాళిక..వారంలోగా ఒప్పుకోవాలని జెలెన్ స్కీపై ఒత్తిడి

ఇదిలాఉండగా అమెజాన్ CEOగా యాండీ జెస్సీ వచ్చినప్పటి  నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 2022-23లో ఏకంగా 27 వేల ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కాలం నడుస్తోందని.. ప్రతి ఉద్యోగి ఏఐ సామార్థ్యాలు పెంచుకోవాలని గతంలోనే యాండీ జెస్సీ సూచించారు. తమ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను విస్తరించడం వల్ల ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని తెలిపారు. అమెజాన్‌తో పాటు టీఎసీఎస్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్ లాంటి బడా కంపెనీలు ఈ ఏడాది లేఆఫ్స్‌ ప్రకటించింది. ఏఐ వినియోగం వల్ల ప్రతీఏడాది వేలాది మంది ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు