Prabhas Japan Event: జపాన్‌ ఈవెంట్ లో అదరకొట్టిన ప్రభాస్.. 'స్పిరిట్' లుక్ ఇదేనా..?

ప్రభాస్ జపాన్‌లో బాహుబలి ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. లీన్ బాడీతో కనిపిస్తున్న ప్రభాస్ లుక్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.. ‘స్పిరిట్’ సినిమాలో కనిపించే పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఈ లుక్ మైంటైన్ చేస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

New Update
Prabhas Japan Event

Prabhas Japan Event

Prabhas Japan Event: పాన్- ఇండియా స్టార్ ప్రభాస్ మళ్లీ ఇంటర్నేషనల్ గా అందరి దృష్టిని ఆకర్షించాడు. జపాన్‌లో జరిగిన “బాహుబలి: ది ఎపిక్” ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రభాస్‌ను చూడటానికి అక్కడి అభిమానులు భారీగా చేరుకున్నారు. బాహుబలి అక్కడ భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో ప్రభాస్ లుక్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ హాట్ టాపిక్ గా మారాయి.

కొంతకాలంగా ప్రభాస్ తన ‘స్పిరిట్’ సినిమా కోసం ప్రత్యేక లుక్‌లో ఉంటున్నాడని, అందుకే ఎలాంటి ఈవెంట్లకు హాజరయ్యే అవకాశమే లేదని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఆయన తలపై నల్లగుడ్డ కట్టుకుని కనిపించడం వల్ల, తన సినిమా లుక్ బయట పడకుండా కాపాడుతున్నారని చెప్పుకున్నారు. కానీ జపాన్ ఈవెంట్‌కు వచ్చిన ప్రభాస్ ఎలాంటి కవర్ లేకుండా, సాధారణ లుక్‌తో అభిమానుల ముందుకొచ్చాడు. దీనితో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్ లీన్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ లీన్ లుక్‌లో కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత కొన్ని సినిమాల్లో అతను మాచో లుక్‌తో కనిపించగా, ఇప్పుడు సన్నగా, సింపుల్‌గా కనిపించడం ఫ్యాన్స్‌కి కొత్త ఉత్సాహం ఇచ్చింది.

‘స్పిరిట్’ సినిమాను తెరకెక్కిస్తున్న సందీప్ రెడ్డి వంగా తన హీరోల లుక్‌పై చాలా శ్రద్ధ పెట్టే దర్శకుడు. కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నందున, అతని లుక్ స్క్రీన్‌పై మరింత స్టైలిష్‌గా ఉండబోతుందని అభిమానులు నమ్ముతున్నారు. జపాన్ ఈవెంట్‌లో కనిపించిన ప్రభాస్ లుక్ చూసి, సినిమా కోసం మరింత ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్

‘స్పిరిట్’తో పాటు త్వరలో విడుదల చేయబోయే మరో చిత్రం “ది రాజా సాబ్”  పై ప్రభాస్ అభిమానులు మంచి ఆశలు పెట్టుకున్నారు. అలాగే, ప్రభాస్ “ఫౌజీ” అనే మరో ప్రాజెక్ట్‌ కోసం కూడా షూటింగ్ చేస్తున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండే ప్రభాస్ ప్రతి సినిమా కోసం తన లుక్‌ను మార్చడం అభిమానులకు స్పెషల్ ట్రీట్‌గా మారుతోంది.

Advertisment
తాజా కథనాలు