Yuvagalam: పసుపు మయమైన ప్రకాశం బ్యారేజ్.. లోకేష్‌కు స్వాగతం

నేడు ఉమ్మడి కృష్ణాజిల్లాకు నారా లోకేష్ పాదయాత్ర చేరుకుంటుంది. ఈ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. లోకేష్ 'స్వాగతం సుస్వాగతం' అంటూ భారీగా స్వాగత బ్యానర్లను ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు .

Yuvagalam: పసుపు మయమైన ప్రకాశం బ్యారేజ్.. లోకేష్‌కు స్వాగతం
New Update

స్వాగతం సుస్వాగతం

విజయవాడలో లోకేష్‌ పాదయాత్ర సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) పసుపు మయమైనంది. లోకేష్ పాదయాత్రకు రానున్న నేపథ్యంలో భారీగా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. అనధికార బ్యానర్లకు ఇటువంటి అనుమతులు లేవు అంటూ నోటీసులు జారీ చేసింది విజయవాడ కమిషనర్. ఫ్లెక్సీలు తొలగిస్తాం అంటూ మున్సిపల్ అధికారులు తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ విడుదల చేసిన సర్కులర్‌పై కలెక్టర్‌ని టీడీపీ (TDP) నేతలు కలిశారు. విజయవాడ నుంచి 3 నియోజకవర్గాల్లో అన్నిచోట్ల లోకేష్ స్వాగతం అంటూ ఫ్లెక్సీలు బ్యానర్లతో నిండిపోయింది.

సభ విజయవంతం చేస్తాం

నారా లోకేష్ పాదయాత్ర విజయవాడకు (Vijayawada) చేరుకుంటుంది. మూడు రోజులపాటు ఈ ఉమ్మడి కృష్ణ జిల్లాలో లోకేష్‌ పాదయాత్ర చేస్తారని టీడీపీ నేతలు తెలిపారు. గన్నవరంలో వేలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు కూడా తీసుకున్నారు. లోకేష్ పాదయాత్రకు ఘన స్వాగతం పలుకుతూ ప్రకాశం బ్యారేజీ వద్ద ఫ్లెక్సీలను టీడీపీ ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. లోకేష్ సభకు వేలాదిగా తరలివచ్చే ప్రజలు, కార్యకర్తల కోసం భారీ ఏర్పాట్లు చేశామని.. ఈ సభకు 50 వేల మందితో లోకేష్ పాదయాత్ర ఈ జిల్లాలో సాగుతోందని కేశినేని చిన్ని తెలిపారు.

ఏం చేస్తారో.. చేసుకోండి..

సాయంత్రం 4:30 నిమిషాలకు విజయవాడకు నారా లోకేష్ పాదయాత్ర చేరుకొనున్నది. పాదయాత్ర విజయవంతానికి ఏర్పాట్లు చేశారు టీడీపీ నేతలు. స్వాగతం తోరణాలు, కటౌట్లు ఫ్లెక్సీలు, హొడింగ్స్ ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో అనధికారికంగా ఉన్న ఫ్లెక్సీలు, హోడింగ్స్, కటౌట్స్‌ను తొలగించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నాలుగు రోజుల క్రితమే దరఖాస్తు చేసామంటున్న టీడీపీ నేతలు చెబుతున్నారు. అనుమతి ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. అనుమతులు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఫ్లెక్సీలు, కటౌట్స్ హోడింగ్స్ కట్టి తీరతామంటూ టీడీపీ నేతల వెల్లడించారు. నగరం అంతా కటౌట్లు,ఫ్లెక్సీలు, జెండాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అనుమతి కోసం నిన్న కమిషనర్‌ని కలవడానికి ప్రయత్నించారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్‌ను టీడీపీ నేతలు కలిశారు. అనుమతిపై పరిశీలిస్తానని టీడీపీ నేతలకు కలెక్టర్ హామీ ఇచ్చారు.

చంద్రబాబు పాలన ఖాయం

లోకేష్‌కు పాదయాత్రతో వైసీపీ (YCP) నేతలకు వణుకు పుడుతుందన్నారు. రాష్ట్రంలో టీడీపీకి నాయకుల మధ్య ఎటువంటి వర్గ విభేదాలు, గ్రూపు రాజకీయాలు లేవని అన్నారు.లోకేష్ చేస్తున్న యాత్రలో నాయకులంతా కలిసి సభను విజయవంతం చేస్తామన్నారు.  అధికార పార్టీ నేతల మాయ మాటలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని ..విజయవాడలో సీట్లు టీడీపీ గెలుచుకోవడం ఖాయమని టీడీపీ శ్రేణులు దీమ వ్యక్తం చేస్తున్నారు.. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును నాయకత్వంపై ప్రజలంతా ఎంతో నమ్మకంతో, ఆశతో పాలన కోసం చూస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.

Also Read: చిరుతపులి భయం ఎఫెక్ట్.. బోసిపోయిన అలిపిరి కాలినడక మార్గం!

#vijayawada #nara-lokesh-padayatra #yuvagalam-nara-lokesh #lokesh-yuvagalam #yuva-galam-padayatra #nara-lokesh #lokesh-padayatra-in-vijayawada #yuvagalam #padayatra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి