Pawan Kalyan: పవన్‌ సార్‌ ..మీకోసం నేనున్నానంటున్న నేచురల్‌ స్టార్‌!

ప్రియమైన పవన్ కల్యాణ్ గారు మీరు అతి పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కొబోతున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని ఆశిస్తున్నాను. నేను మీకోసం మద్దతుగా నిలుస్తున్నాను.. ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అంటూ న్యాచురల్ స్టార్ నాని ట్వీట్ చేసారు.

New Update
Pawan Kalyan: పవన్‌ సార్‌ ..మీకోసం నేనున్నానంటున్న నేచురల్‌ స్టార్‌!

AP: ఏపీలో 6 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మంచి రసవత్తరంగా మారాయి. అయితే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గంఏదైనా ఉంది అంటే అది పిఠాపురమే.ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు . గత ఎన్నికలలో పవన్ గాజువాక ,భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ కు సినిమా వారు ఎవరూ కూడా బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు.

ఈ సారి టాలీవుడ్ లో చాల మంది సినీ ప్రముఖులు పవన్ కల్యాణ్ కు మద్దతు తెలుపుతున్నారు .ఈసారి జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది. టీడీపీ, బీజేపీలతో కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది . ఈసారి పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజక వర్గంలో ఎలాగైనా గెలిపించుకోవాలని టాలీవుడ్ లో పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ కూడా పవన్ కు మద్దతు తెలిపారు.

టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని పవన్ కు తన మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసారు. ప్రియమైన పవన్ కల్యాణ్ గారు మీరు అతి పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కొబోతున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని ఆశిస్తున్నాను. నేను మీకోసం మద్దతుగా నిలుస్తున్నాను.. ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అంటూ నాని ట్వీట్ చేసారు.

Also read: భర్తను మంచానికి కట్టేసి.. ఆ పార్ట్ లో సిగరేట్ తో కాల్చి.. ఈ రాక్షసి భార్య ఇంకేం చేసిందంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు