Marri Janardhan Reddy: నా రాజకీయ జీవితం ప్రజలకే అంకితం కాంగ్రెస్‌పై నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితం ప్రజలకే అంకితమన్న ఆయన.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమన్నారు. By Karthik 01 Sep 2023 in రాజకీయాలు మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి తన రాజకీయ జీవితం ప్రజలకే అంకితమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. తన పాదయాత్రలో భాగంగా తలకపల్లి మండల పరిధిలోని కార్వంగ గ్రామంతో మీడియాతో మాట్లాడిన ఆయన.. నాగర్ కర్నూల్ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి శక్తి వంచనా లేకుండా పనిచేస్తున్నానన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయ్యాక పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. పాదయాత్రలతో ప్రజా సమస్యలు తన దృష్టిని వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామన్నారు. Your browser does not support the video tag. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాంగ్రెస్ హయాంతో రాష్ట్రం ఎక్కడా సాగునీరు అందలేదని గుర్తు చేశారు. రైతులు సాగు నీరు లేకపోవడంతో పంటలు పండిచలేక తీవ్ర ఇబ్బందులకు గుయ్యారన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎన్ని గంటలు ఉంటుందో తెలియక రైతులు నరకయాతన అనుభవించారని మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు సైతం కాంగ్రెస్ కార్యకర్తలకే కట్టించారని ఆరోపించారు. అప్పట్లో గ్రామాల్లో రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదని ఎమ్మెల్యే వెల్లడించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉందని తెలిపారు. రైతులను 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. కాగా తన పాదయాత్రలో ప్రజల సమస్యల గురించి తెలుసుకొని వాటిని అప్పటికప్పుడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. నియోజకవర్గంలో ఎవరు ఎన్ని జమ్మిక్కలు చేసిని ప్రలజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. #brs #congress #people #nagar-kurnool #marri-janardhan-reddy #padayatra #problems #solution మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి