సీఎం కేసీఆర్ తనకే మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. మూడోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ జనగామ నియోజకవర్గ బిఅర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే.. స్వామిరికి ప్రత్యేక పూజలు చేశారు. తన కోరిక నెరవేరాలని గంగిరేగు చెట్టుకు ముడుపుకట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ముడోసారి జనగామ టికెట్ తనకే రావాలని తాను మల్లికార్జున స్వామిని కోరుకున్నట్లు ముత్తిరెడ్డి తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
గత 5 సంవత్సరాలుగా జనగామ నియోజకవర్గంలో చెరువుల పురుద్దరుణ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రోడ్లు సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రోడ్డు రవాణా వ్యవస్థను బాగు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో మిషన్ భగీరథ పైపు లైన్లు వేసి ప్రతీ ఇంటికి మంచినీరు అందిస్తున్నట్లు వెల్లడించారు. గత 5 ఏళ్లుగా జనగామా పట్టణాన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడమే కాకుండా పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు.
కాగా సీఎం కేసీఆర్.. ఇటీవల విడుదల చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్‌లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేరు లేదు. అంతే కాకుండా జనగామ నియోజకవర్గ స్థానాన్ని సీఎం పెండింగ్‌లో ఉంచారు. దీంతో ముత్తిరెడ్డికి స్థానం దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.