Mumbai Indians: హార్దిక్‌ పాండ్యా కోసం అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు చేసిన ముంబై.. కారణం ఇదే!

పాండ్యను గుజరాత్ నుంచి ముంబై ట్రేడ్ చేసుకోవడం ఐపీఎల్‌ ప్రపంచాన్ని ఊపేసింది. ఈ డీల్‌ కోసం ముంబై ఇండియన్స్‌ అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు పెట్టిందని.. గుజరాత్‌కు ఇంత భారీ మొత్తాన్ని అంబానీ ఫ్యామిలీ ట్రాన్స్‌ఫర్ చేసిందని "Indian Express" ఓ కథనాన్ని ప్రచురించింది.

Mumbai Indians: హార్దిక్‌ పాండ్యా కోసం అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు చేసిన ముంబై.. కారణం ఇదే!
New Update

Mumbai Indians: ఐపీఎల్‌(IPL)లో ట్రేడింగ్‌ న్యూస్‌ పెద్దగా హాట్‌ టాపిక్‌ అవ్వదు. అయితే ఈ సారి ముంబై ఇండియన్స్‌(Mumbai Indians), గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans) మధ్య జరిగిన ప్లేయర్ల ట్రేడింగ్‌ పెద్ద భూకంపానికే దారి తీసింది. ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ నుంచే స్టార్‌గా ఎదికి.. 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ చెంతకు చేరిన హార్దిక్‌ పాండ్యా(Hardik Pandya)ను ముంబై రెండేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి ఆహ్వానించింది. ఇది చాలా మంది ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌కు మింగుడుపడని విషయం. ముంబై ఫ్రాంచైజీని వీడిన తర్వాత పాండ్యా పలుమార్లు రోహిత్‌ జట్టుపై నోరుపారేసుకున్నాడు. ముంబై కేవలం స్టార్లనే కొంటుందంటూ.. చెన్నై అలా కాదంటూ ఆగ్రహం తెప్పించాడు. అందుకే పాండ్యా రీఎంట్రీని ముంబై ఫ్యాన్స్‌ స్వాగతించలేదు. ఇదంతా జరుగుతున్న సమయంలో హఠాత్తుగా పాండ్యాను కెప్టెన్‌గా నియమిస్తూ మరో బాంబు పేల్చింది ముంబై. ఇంకంతే.. రోహిత్‌ ఫ్యాన్స్‌ ఫ్రస్ట్రెషన్‌ పీక్స్‌కు వెళ్లిపోయింది. ముంబై అఫిషియల్‌ అకౌంట్స్‌ను అన్‌ఫాలో చేయడంతో పాటు కొంతమంది ఏకంగా MI జెర్సీలను తగలబెట్టారు. ఈ గొడవ ఇప్పటికీ అలానే ఉండగా.. ఈ ట్రేడ్‌కు సంబంధించిన మరో బాంబు లాంటి న్యూస్‌ బయటకు వచ్చింది.

Also Read: ‘తాత్కాలిక కమిటీ ఏర్పాటు..’ క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయంతో బీజేపీ ఎంపికి బిగ్ షాక్‌!

రూ.100కోట్లకు ట్రేడ్?
ముంబై ఇండియన్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య పాండ్యా కోసం ఏకంగా 100 కోట్ల రూపాయల (100 Crores) డీల్‌ జరిగిందని ప్రముఖ వార్త సంస్థ "Indian Express" ఓ కథనాన్ని ప్రచురించింది. ఇది కాస్త నిమిషాల్లో క్రికెట్‌ సర్కిల్స్‌లో తెగ షేర్ అవుతోంది. నిజానికి ఈ డీల్‌ ముగిసిన తర్వాత గుజరాత్‌ పర్సులో రూ.15కోట్లు యాడ్‌ అయ్యాయి. అంటే పాండ్యాకు రూ.15కోట్లు ఇచ్చి ట్రేడ్‌ చేసుకున్నట్టు అర్థం. అయితే అమౌంట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసింది మాత్రం రూ.100 కోట్లుగా తెలుస్తోంది. అంటే పాండ్యా ఒక్కడి కోసం ముంబై ఏకంగా రూ.100కోట్లను వదులుకుంది. ఎంతైనా అంబానీ (Mukesh Ambani) కదా.. ఇదేం పెద్ద లెక్క కాదులే అని బిజినెస్‌ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయపడొచ్చు కానీ.. క్రికెట్‌ పరంగా ఒక ప్లేయర్‌ కోసం ఇంత ఖర్చు చేయడమంటే చిన్నచితాక విషయం కాదు.

ఎందుకింత ఖర్చు చేసింది?
రానున్న 2024 ఐపీఎల్‌ సీజన్‌తో చాలా మంది ప్లేయర్ల కాంట్రెక్ట్‌ ముగుస్తుంది. 2025 సీజన్‌కు మెగా వేలం జరుగుతుంది. అంటే ఫ్రాంచైజీలు కేవలం నలుగురు ప్లేయర్లనే అంటిబెట్టుకోవాల్సి ఉంటుంది. రోహిత్ వయసు 36ఏళ్లు.. ఒకవేళ రోహిత్ జట్టులో కొనసాగినా ప్లేయర్‌గానే ఉంచుకోవాలన్నది ముంబై ప్లాన్ కావొచ్చు. ఇటు30ఏళ్ల పాండ్యా భవిష్యత్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పండితులు అభిప్రాయపడుతున్నారు. మెగా వేలంలో కొనుగోలు చేసే బదులు ఈ సీజన్‌కే ట్రేడ్‌ చేసుకోని.. తమతో పాటే 2025,2026,2027 సీజన్లకు పాండ్యాను కెప్టెన్‌గా ఉంచుకోవడం బెటర్‌ అని ముంబై ఫ్రాంచైజీ భావించినట్టు సమాచారం. అయితే ఈ రూ.100 కోట్ల డీల్‌పై అధికారిక ప్రకటన లేదు. ఈ లెక్కల వివరాలు కేవలం బీసీసీఐ వద్ద మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి.

Also Read: బెంచ్‌కే పరిమితం కానున్న నంబర్‌-1 ప్లేయర్‌.. దక్షిణాఫ్రికాతో టెస్టుకు భారత్‌ తుది జట్టు ఇదే!

WATCH:

#mumbai-indians #rohit-sharma #hardik-pandya #ipl #cricket-news #ipl-2024 #gujarat-titans
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe