YSRCP MP Vijayasai Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఏపీ పర్యటనలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ (TDP), వైసీపీ (YSRCP) నుంచి ఫిర్యాదుల వర్షం వెల్లువెత్తుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సీఈసీకి (Central Election Commission) మొత్తం ఆరు అంశాలపై నివేదిక అందించామని అన్నారు. ఏపీకి తెలంగాణకు ఒకేసారి లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) పెట్టాలని వారిని కోరినట్లు తెలిపారు.
జనసేన గుర్తింపులేని పార్టీ..
జనసేన (Janasena) గుర్తింపులేని పార్టీ అని అన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. గుర్తింపులేని పార్టీ జనసేనను ఎలా అనుమతించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. జనసేనకు ఉన్న గ్లాస్ గుర్తు జనరల్ సింబల్ అని అన్నారు. ఆరు అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయటం అనేది చట్ట విరుద్ధం అని పేర్కొన్నారు.
ALSO READ: కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే డేంజర్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
విదేశాల నుంచి టీడీపీ..
మై పార్టీ డ్యాష్ బోర్డును విదేశాల నుంచి టీడీపీ (TDP) నడిపిస్తోందని ఫిర్యాదు ఈసీకి ఫిర్యాదు చేసినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైల్ తయారు చేస్తోందని అన్నారు. టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. కోనేరు సురేష్ అనే వ్యక్తి పదిలక్షలపై చిలుకు ఓట్లు బోగస్ అని సీఈవోకి ఫిర్యాదు ఇచ్చాడని తెలిపారు. ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుంది?, బోగస్ ఓట్ల గురించి బీఎల్ఓస్ చెప్పాలి, గాని ఒక వ్యక్తి ఎలా చెబుతున్నాడు?, ఆ ఫిర్యాదే బోగస్ అని చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా..
రాష్ట్రవ్యాప్తంగా బోగస్ ఓట్లు అనేవి లేవని కలెక్టర్లు నివేదిక ఇచ్చారని విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ వారు ఉద్ధేశ పూర్వకంగా వైఎస్సార్‌సీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఓటర్లు (Telangana Voters) ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారని అన్నారు. ఇలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించాలని ఈసీని కోరినట్లు తెలిపారు. తెలంగాణ ఓటర్ లిస్టులో డిలీట్ చేశాకే ఏపీలో ఓటరగా నమోదు చేసుకోవాలని అన్నారు.
లోకేష్ బెదిరిస్తున్నాడు..
యువగళం (Yuvagalam) ముగింపు సభలో చంద్రబాబు (Chandrababu) అసభ్యపదజాలంతో సీఎం జగన్‌ను (CM Jagan) విమర్శించారని విజయసాయి రెడ్డి అన్నారు. లోకేష్ (Lokesh) ఎర్రబుక్ పేరుతో అధికారులను బెదిరిస్తున్నాడని అన్నారు. అధికారుల పేర్లు నోట్ చేసుకుంటున్నా వాళ్లను సర్వీస్ నుండి తీసేస్తాం అంటూ లోకేష్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు వెల్లడించారు.
ఏపీ, తెలంగాణలో ఒకసారి ఎన్నికలు..
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఒకే రోజు పార్లమెంట్ ఎన్నికలు జరపాలని ఈసీని కోరినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఒకే రోజు ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు జీవితమే మోసపూరితం..కుట్రలతో నిండిపోయిందని వ్యాఖ్యానించారు.
ALSO READ: జగన్ ఇక మాజీ సీఎం.. KA పాల్ శాపనార్థాలు