MP Bharat: రాజమండ్రి స్వచ్చత.. ప్రతీ ఒక్కరి బాధ్యత

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు.

MP Bharat: రాజమండ్రి స్వచ్చత.. ప్రతీ ఒక్కరి బాధ్యత
New Update

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్.. చీపురు పట్టుకొని వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజమండ్రి పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతీ ఒక్కరు వారానికి ఒకసారైనా వీధులను శుభ్రం చేసుకోవాలని ఎంపీ సూచించారు. మరోవైపు మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై ఎంపీ భరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండారు సత్యనారాయణకు సిగ్గుందా అని ఎంపీ వ్యాఖ్యలు చేశారు. బండారుకు భార్య, కుమార్తె ఉన్నారన్న ఆయన వారిని అంటే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మంత్రి పదవిలో ఉన్నది మహిళా అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన బాండారు సత్యనారాయణ లాంటి వ్యక్తిని అర్ద నగ్నంగా ఊరేగించినా తక్కువే అవుతుందన్నారు. పోలీసులు ఇలాంటి దుర్మార్గులపై నిర్భయ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని ఎంపీ మండిపడ్డారు.

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై ఎంపీ భరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు అందగానే లోకేష్‌కు వణుకు పుట్టడం స్టార్ట్‌ అయిందన్నారు. లోకేష్‌ జైల్లో తండ్రిని, బయట తల్లి, భార్యను వదిలి వెళ్లి ఢిల్లీలో దాచుకున్నాడని ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌ యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నాడని ఎంపీ ప్రశ్నించారు. లోకేష్‌ ఏ కలుగులో దాకున్నా సీఐడీ తోక పట్టుకొని లాగుతుందని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరి దీక్ష ఎందుకు చేస్తున్నారో చెప్పాలని భరత్‌ ప్రశ్నించారు. టీడీపీ నాయకుల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ భరత్‌ పేర్కొన్నారు.

#broom #streets #cleanliness #tdp #cleaning #mp-bharat #chandrababu-naidu #rajahmundry #ycp #bandaru-satyanarayana #nara-lokesh #cm-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe