Kavita : ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడీషల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి కూడా కోర్టు.. కవిత కస్టడీని పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

New Update
Kavita : ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత..

Liquor Scam Case : మద్యం పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) జ్యూడీషల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court) లో ప్రవేశపెట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కాకుండా నేరుగా న్యాయస్థానంలోనే విచారించాలని కవిత వేసిన పిటిషన్‌కు కోర్టు అనుమతించింది. అయితే ఈసారి కూడా కోర్టు.. కవిత కస్టడీని పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత.. ఈడీ, సీబీఐ కేసుల్లో వేరువేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆమె తెలిపారు. మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందని చెప్పారు.

Also Read: అన్ని రకాల కరోనా వైరస్‌లకు ఒకే వ్యాక్సిన్..

అయితే దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కవితకు పిటిషన్లను తిరస్కరిస్తూ బెయిల్ ఇవ్వలేదు. ఆమె బెయిల్ నుంచి బయటకు వస్తే.. సాక్ష్యాలను తారుమారు చేస్తారనే అనుమానంతో కోర్టు బెయిల్‌కు నిరాకరించింది. ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్‌లోని తన ఇంట్లో కవితను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత జ్యూడీషియల్ రిమాండ్ కోసం కోర్టు తీహార్ జైలు(Thihar Jail) కు తరలించింది. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని ఈడీ, సీబీఐలు ఆరోపించాయి. ఈ లిక్కర్ వ్యవహారంలో కవిత పాత్ర కూడా ఉందని.. ఆమెకు ఇండోస్పిరిట్ లో 33% వాటా ఉందని ఆరోపణలతో చివరికి ఆమె అరెస్టయ్యింది.

Also Read: గుడ్ న్యూస్.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది.. 

Advertisment
Advertisment
తాజా కథనాలు