ఆరోగ్య బీమా(Health Insurance) తీసుకునే వారికి త్వరలో శుభవార్త అందుతుంది. ఆరోగ్య బీమాపై జిఎస్టిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం జిఎస్టి కౌన్సిల్‌కు ప్రతిపాదించే అవకాశం ఉంది. ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.30,000 వరకు జీఎస్టీని తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ప్రకారం, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ రేటును ప్రస్తుత 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించవచ్చు. ఎక్కువ మందికి ఆరోగ్య బీమా(Health Insurance) అందుబాటులోకి రావాలంటే జీఎస్టీ రేటును తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పూర్తిగా చదవండి..Health Insurance: గుడ్ న్యూస్.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది..
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇది కనుక అమలు అయితే, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చౌకగా మారుతుంది. సార్వత్రిక ఎన్నికల తరువాత ఈ ప్రతిపాదన అమలులోకి రావచ్చు.
Translate this News: