MLC Kavita: మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత..

ఎమ్మెల్సీ కవిత మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు మళ్లీ ఏప్రిల్ 23 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

New Update
MLC Kavita: మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత..

MLC Kavitha Bail Petition - Delhi Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు.. తాజాగా మళ్లీ ఈ నెల 23 వరకు జ్యూడీషియల్ కస్టడి విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఎమ్మెల్సీ కవిత మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. ప్రస్తుతం తీహార్ జైల్లోని జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ఈ నెల 11న సీబీఐ (CBI) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: తెలంగాణ రైతులకు శుభవార్త.. రుణమాఫీ, రైతుభరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన!

అరెస్టు అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచగా.. న్యాయస్థానం ఆమెను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. అయితే ఆ కస్టడీ నేటితో ముగియడంతో.. కవితను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. మరో 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీ పొడిగించాలని సీబీఐ.. కోర్టును కోరింది. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం మరో తొమ్మిది రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఈనెల 23 వరకు కవిత మళ్లీ జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. కోర్టు తీర్పు అనంతరం సీబీఐ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఆమె బెయిల్ కోరుతూ పిటిషన్ ధాఖలు చేశారు.

Also Read: లోక్‌సభ ఎన్నికలు.. నిత్యం పట్టుబడుతున్న రూ.100 కోట్లు

Advertisment
తాజా కథనాలు