Uttam Kumar Reddy: ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌లో ఎవరూ ఉండరు: ఉత్తమ్

జిల్లాల పర్యటనలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన మాటాలు అన్ని అబద్ధాలేనని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. వారి హయాంలో నిటి పారుదల రంగాన్ని నాశం చేశారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరంటూ ఎద్దేవా చేశారు.

New Update
Uttam Kumar : అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు

Uttam Kumar Reddy: మాజీ సీఎం కేసీఆర్‌ నిన్న(ఆదివారం) జనగాం, సూర్యాపేట జిల్లాల్లో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే కేసీఆర్‌ (KCR) మాట్లాడిన మాటలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. బీఆర్‌ఎస్ హయాంలో నీటి పారుదల రంగాన్ని నాశనం చేశారంటూ విమర్శించారు. నిన్న కేసీఆర్‌ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే అని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. రైతులకు పంట బీమా కూడా ఇవ్వలేదన్నారు. పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. విద్యుత్ విషయంలో వారు ఏదో సాధించామని గొప్పలు చెప్పడం కూడా అబద్ధమన్నారు.

Also Read: కడప ఎంపీగా షర్మిల.. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ రెడీ!

ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌లో ఉండరు

ఇప్పుడు కేసీఆర్‌ డిప్రెషన్, ఫ్రస్టేషన్‌లో ఉన్నారని.. ఆ పార్టీలో ఎవరూ ఉండరనే భయం మొదలైందని ఉత్తమ్ అన్నారు. జాతీయ పార్టీ అంటూ ప్రచారం చేశారని.. ఇంత త్వరగా ఏ పార్టీ కూడా కుప్పకూలలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తర్వాత బీఆర్‌ఎస్‌ మిగలదని.. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప అందులో ఉండరంటూ ఎద్దేవా చేశారు.

సిగ్గుపడాలి

' బీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ పంట బీమాను రద్దు చేసి.. నష్టం జరిగిన రైతులకు పరిహారం ఇవ్వలేదు. నీటిపారుదల రంగంలో ప్లాన్, డిజాన్లు లేకుండా ప్రాజెక్టులు నిర్మించారు. కాళేశ్వరంపై మాట్లాడేందుకు ఆయన సిగ్గుపడాలి. కాళేశ్వరం కోసం విద్యుత్‌ ఖర్చు ఏడాదికి రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ప్రాజెక్టును కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు ఆయనే ఒప్పుకున్నారు. ఎన్డీపీసీకి సహకరించి ఉంటే.. 4 వేల మెగావాట్ల విద్యుత్‌ వచ్చేది. 24 గంటల విద్యుత్‌ ఇచ్చేందుకు ఖర్చు గురించి ఎందుకు ఆలోచించడం లేదు. ఇప్పుడు మేము ఒక్కో ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని' ఉత్తమ్‌ కుమార్‌ అన్నారు.

Also Read: వినియోగదారులకు షాక్‌.. పెరిగిన టోల్‌ ఛార్జీలు.. ఎంతంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు