కడప ఎంపీగా షర్మిల.. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ రెడీ!

ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. కడప ఎంపీ స్థానానికి వైఎస్ షర్మిల రెడ్డి పోటీని హైకమాండ్ ఖరారు చేసినట్లు సమాచారం.

New Update
కడప ఎంపీగా షర్మిల.. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ రెడీ!

ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థుల (AP Elections Congress Candidates) ఖరారుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. కడప ఎంపీ స్థానానికి వైఎస్ షర్మిల రెడ్డి (YS Sharmila) పోటీని హైకమాండ్ ఖరారు చేసినట్లు సమాచారం. మరో సీనియర్ నేత రఘువీరారెడ్డి పోటీకి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. నేటి సాయంత్రంలోగా అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రోజు జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, AICC జనరల్ సెక్రెటరీ మధుసూదన్ మేస్త్రి, పీసీసీ చీఫ్‌ షర్మిలారెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: AP: వాలంటీర్లకు మరో షాక్‌… ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనవద్దు!

ఏపీలో మొత్తం 150 సీట్లకు గాను 130 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇంకా 25 సీట్లకు గాను 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారైనట్లు సమాచారం. ఇంకా తిరుపతి, గుంటూరు విజయవాడ, అమలాపురం కర్నూలు, నంద్యాల, అనంతపురం, అరకు స్థానాలను కాంగ్రెస్ హైకమాండ్ పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. ఈ మిగిలిన సీట్లలో కొన్నింటినీ వామపక్షాలకు కేటాయించే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల వీరే?
---- రాజమండ్రి - గిడుగు రుద్రరాజు
---- బాపట్ల - జెడి శీలం
---- కాకినాడ - పళ్ళం రాజు
---- అనకాపల్లి - వేగి వెంకటేష్
---- విశాఖ - సత్యారెడ్డి
---- ఏలూరు - లావణ్య
---- రాజంపేట - నజీర్ అహ్మద్
---- చిత్తూరు - చిట్టిబాబు
---- హిందూపురం - షాహిన్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు