Minister Sridhar Babu: తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచింన కాంగ్రెస్ పార్టీ ఆవైపు అడుగులు వేస్తోంది. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, మంథాని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని.. ప్రజలు సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమని ఆయన అన్నారు. నిరుద్యోగులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వృధా చేయమని స్పష్టం చేశారు.
ALSO READ: రేపు కాంగ్రెస్ కీలక భేటీ.. వారందరికీ పదవులు!
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండవని ఆయన అన్నారు. గత పాలసీలు ఉపయోగకరంగా ఉంటే మరింత ముందుకు తీసుకెళ్తాం అని పేర్కొన్నారు. రాబోయే బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యమిస్తాం తెలిపారు. తెలంగాణాని అన్ని రంగాల్లో దేశంలో నెంబర్-1గా నిలపడనికి కృషి చేస్తాం అని అన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుపుతామని.. అందరిని కలుపుకుని ముందుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. యువతకు ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపట్టాం అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను గుర్తిస్తున్నామని అన్నారు.
ALSO READ: 11 మంది IASల బదిలీ… ఆ అధికారికి చెక్..!
మేడిగడ్డ పిల్లర్ల అంశంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..
తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన కాళేశ్వరం, మేడిగడ్డ పిల్లర్ల కుంగిపోవడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఈఎన్సీ మురళీధర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటకు కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ, అన్నారం ప్రోజెక్టులపై విచారణకు ఆదేశిస్తామని నిన్న కౌన్సిల్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై త్వరలోనే కమిటీ వేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.