Minister Sridhar Babu: తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచింన కాంగ్రెస్ పార్టీ ఆవైపు అడుగులు వేస్తోంది. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, మంథాని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని.. ప్రజలు సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమని ఆయన అన్నారు. నిరుద్యోగులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వృధా చేయమని స్పష్టం చేశారు.
పూర్తిగా చదవండి..TS Govt: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగ భర్తీకి గ్రీన్ సిగ్నల్!
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండవని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు.
Translate this News: