Peddireddy: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు

మరికొన్ని నెలల్లో జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని చంద్రబాబు భయం పట్టుకుందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీకి చేసింది ఏమి లేదని అన్నారు. జగన్ లాంటి సీఎంను ఇంత వరకు చూడలేదని పేర్కొన్నారు.

New Update
Peddireddy: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు

Peddireddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. వైఎస్సార్‌సీపీలో టిక్కెట్లు రావని తెలిసినవారిని చేరదీస్తూ సంబరపడుతున్నాడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. 2019 ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయ ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు
ప్రశాంత్ కిషోర్ పేకాటలో డిస్‌కార్డు లాంటి వ్యక్తి అని ఆరోపించారు. ప్రశాంత్ కిషోర్‌ను మేము వదిలేశాక చంద్రబాబు అక్కున చేర్చుకున్నాడని సెటైర్లు వేశారు. చంద్రబాబు తప్పుడు ప్రచారానికి ఎల్లో మీడియా అండగా ఉందని ఆరోపించారు.

ALSO READ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల.. గిడుగు రుద్రరాజు క్లారిటీ!

మదనపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కుప్పం లో చాలా పెద్ద యెత్తున కనకదాసు విగ్రహ ఆవిష్కరణ చేశామని అన్నారు. భక్త కనకదాస జయంతి ని ప్రతి ఏటా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సారి కుప్పం లో భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణ చేసామని తెలిపారు. తిమ్మప్ప గా జన్మించి అయన భక్త కనకదాస గా మారారని అన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శం అని కొనియాడారు. మన కురభ కులంలో అంత గొప్ప వ్యక్తి పుట్టడం అందరి అదృష్టం అని అన్నారు. అనంతరం సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. సిఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీల కోసం కృషి చేస్తున్నారని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రి గా ఉండి చంద్రబాబు ఏపీకి చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అవ్వగానే అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు తెచ్చారని హర్షం వ్యక్తం చేశారు. తన 45 సంవత్సరాల రాజకీయం జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని అన్నారు. ఐదేళ్ళ పాలనలో కరోనా తో రెండు సంవత్సారాలు కోల్పోయాం అని అన్నారు. మూడేళ్ల లో ఈ స్థాయిలో అభివృద్ది చేసి చూపించారు సీఎం జగన్ అని కొనియాడారు. మరో 5 ఏళ్లు శ్రీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే మరింత అభివృద్ది చేసి చూపుతారని అన్నారు. సిఎం వైఎస్ జగన్ కు అందరూ అండగా నిలవాలని కోరారు.

ALSO READ: పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. లోకేష్ ట్వీట్! 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు