పెద్ది రెడ్డికి పవన్ సీరియస్ వార్నింగ్ | Pawan gives seriouswarning to Peddi Reddy |RTV
AP: మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పీఏలు తుకారాం, శశికాంత్, మాధవరెడ్డి, అతడి అనుచరుడు రామకృష్ణారెడ్డిపై FIR నమోదు చేశారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు. పీఏలు శశి, తుకారం, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, అనుచరుడు బాబ్జాన్ ఇంట్లో తనిఖీలు చేశారు. నిన్న ఒక్కరోజే ఐదుగురి ఇంట్లో సోదాలు చేసి కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అరెస్టుల పర్వం నడుస్తోంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విదేశాలకు వెళ్లకూడదన్న షరతులతో విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో తరువాత అరెస్ట్ ఎవరిదీ ఉంటుంది అనేదానిపై ఏపీలో చర్చలు గట్టిగా నడుస్తున్నాయి.
మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు.. మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింకావెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలపతి నివాసంలో పోలీసులు పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం.
AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పులిచెర్ల ZPTC పదవితోపాటు.. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
పుంగనూరులో రాత్రికి రాత్రే షటిల్ కోర్టును కొందరు దుండగులు నేలమట్టం చేశారు. దాదాపు రూ.60 లక్షల విలువైన ఆస్తిని ధ్వంసం చేశారు. దీంతో క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఫౌండర్స్ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశారు.
AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి మరో షాక్ తగిలింది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తంబల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తో సహా 12మందికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. తనపై దాడి చేశాారని, తప్పుడు కేసులు నమోదు చేశారని హై కోర్టులో మాజీ జడ్జి రామకృష్ణ పిల్ దాఖలు చేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత ఎంఆర్సీ రెడ్డి పై వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో క్రమశిక్షణ సంఘం ఆయన మీద చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.