Jagadishwar Reddy: హింస సృష్టించాలని చూస్తే ఊరుకోం

బీజేపీపై విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో హింస సృష్టించాలని చూస్తుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ పార్టీ హైదరాబాద్‌లో సభ నిర్వహించిందన్న ఆయన.. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరయ్యారన్నారు.

New Update
Jagadishwar Reddy: హింస సృష్టించాలని చూస్తే ఊరుకోం

బీజేపీపై విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో హింస సృష్టించాలని చూస్తుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ పార్టీ హైదరాబాద్‌లో సభ నిర్వహించిందన్న ఆయన.. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హాజరయ్యారన్నారు. అమిత్‌ షా రాష్ట్రానికి వచ్చి ప్రజలను ఆయోమయానికి గురి చేసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ చరిత్ర మళ్లీ ప్రజలకు చెప్పి తగ్గిన గాయాలను మళ్లీ అంటిచాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒకే కుటుంబగా ఉన్న రాష్ట్ర ప్రజలను విడదీసే ప్రయత్నం చేస్తుందని జగదీశ్వర్‌ రెడ్డి విమర్శించారు.

2014 నుంచి 2022 వరకు హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకులు నిర్వహించని కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్దికోసమే బీజేపీ పెద్దలు వారానికి ఓసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని మోడీ తన సహచరులను హైదరాబాద్‌ పంపి హంగామా సృష్టించాలని చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వకున్నా సొంత నిధులతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారన్నారు.

దేశంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, బీసీబంధు, దళిత బంధు లాంటి పథకాలు తీసుకువచ్చి అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్‌ ఆదుకుంటున్నారని జగదీశ్వర్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాలు నిజమో కాదో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రంలో ఎలాంటి చిచ్చు పెట్టాలని చూసినా తాము చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు