World Polio Day 2023:నేడు ప్రపంచ పోలియో దినోత్సవం
పోలియో ఒకప్పుడు ఇదో పెద్ద మహమ్మారి. దీని బారిన పడి చాలా మంది పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అయిపోయాయి. గర్భధారణ సమయంలో లేదా పిల్లలకు ఈ వ్యాధి సోకుతుంది.పోలియో పోలియోమైలిటిస్ లేదా పోలియో వైరస్ వల్ల కలిగే వ్యాధి. దీనినే శిశువు పక్షవాతం అని కూడా అంటారు.ప్రమాదకరమైన అంటువ్యాధిగా పరిగణించే పోలియో నేరుగా నాడీ మండలంపైనే దాడి చేస్తుంది. దీన్ని అరికట్టడానికి..పోలియో టీకాల మీద అవగాహన పెంచడానికి అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.