/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/upasana.png)
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. ఇప్పుడు పద్మ విభూషణ్ చిరంజీవి. కెరీర్ మొదలుపెట్టిన రోజుల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొని హీరోగా నిలబడి.. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు ఎదిగి ఆ తరువాత పద్మ అవార్డుల్లో అత్యున్నత పురస్కరాలను అందుకొని నేడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్(Padma Vibhushan) దక్కడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు స్వయంగా, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ(Cinema Industry) మొత్తం కూడా చిరంజీవి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే చరణ్(Ram Charan) భార్య , మెగా కోడలు ఉపాసన (Upasana) తన మామగారికి చాలా స్పెషల్ గా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో మరో విశేషం ఏంటంటే..ఈ సందర్భంగా ఉపాసన చరణ్ తమ మెగా వారసురాలు చిత్రాన్ని కూడా కనికనిపించకుండా విడుదల చేశారు.
Also Read : Union Budget 2024 : బడ్జెట్ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి!
''చిరు'' త పద్మ విభూషణ్ ...లవ్ యూ''..
మెగా కోడలు సోషల్ మీడియా(Social Media) లో ఓ ఫోటోను విడుదల చేశారు. అందులో మెగా వారసురాళ్లు అందరూ ఉన్నారు. ఆ ఫోటోను ఉపాసన షేర్ చేస్తూ... మీరు ఇక్కడ చూస్తున్నది శక్తివంతమైన పిడికిలి ఐదు వేళ్లు. కేవలం సినిమా, దాతృత్వం విషయంలోనే కాకుండా మీరు జీవితంలో నాన్నగా, మామగారిగా, తాతగా మా అందరికీ స్ఫూర్తిగా నిలిచిన మీకు ప్రత్యేక అభినందనలు. ''చిరు'' త పద్మ విభూషణ్ ...లవ్ యూ'' అంటూ రాసుకొచ్చారు.
ఉపాసన షేర్ చేసిన చిత్రంలో చిరంజీవితో పాటు ఆయన పెద్ద కూతురు సుస్మిత పిల్లలు సమారా, సంహితతో పాటు శ్రీజ పిల్లలు నివ్రితి, నివిష్క ఉన్నారు. వీరి నలుగురితో పాటు అసలు మెగా వారసురాలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల వారసురాలు...క్లీంకార (Klinkara) కూడా ఉంది. మెగా వారసురాలు పుట్టిన సమయంలో మెగా కుటుంబంతో పాటు మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు.
ఇప్పటి వరకు క్లీంకార ముఖం చూపించలేదు మెగా కుటుంబం. ఈ చిత్రంలో క్లీంకార ముఖాన్ని మొత్తం బ్లర్ చేశారు. ఈ ఫోటోలో క్లీంకార లంగా జాకెట్టులో భలే ముద్దుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Also read: ప్రభాసే నా కాళ్లు పట్టుకున్నాడు..సలార్ నటుడు సంచలన వ్యాఖ్యలు!