Lokesh: టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసులు నమోదుచేడయంపై యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష టీడీపీ నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో అని ప్రశ్నించారు. By BalaMurali Krishna 25 Aug 2023 in విజయవాడ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Cases Against TDP Leaders: గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసులు నమోదుచేడయంపై యువనేత నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. "యువగళం సభలో నేను, మా టిడిపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశామని పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నా తల్లిని అవమానించినవాళ్లు, మరో తల్లిని అవమానించకుండా బుద్ధి చెబుతాననడం రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా అవుతాయో! ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష టీడీపీ నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో అని అడిగారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు (Chandrababu)పై ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ రెడ్డి చేసినవని చెప్పుకొచ్చారు. అపోజిషన్ లీడర్‌లా కాకుండా ఫ్యాక్షనిస్టులా చంద్రబాబుని కాల్చి చంపండి, ఉరి వేయండి, చెప్పులతో కొట్టండి, చీపుర్లతో తరమండి అని విద్వేషం నింపే ప్రసంగాలు చేశారు" అని లోకేశ్ ట్వీట్ చేశారు. యువగళం సభలో నేను, మా టిడిపి నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశామని పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నా తల్లిని అవమానించినవాళ్లు, మరో తల్లిని అవమానించకుండా బుద్ధి చెబుతాననడం రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా అవుతాయో! ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక… pic.twitter.com/le1Yf0D8Yw — Lokesh Nara (@naralokesh) August 25, 2023 ఇటీవల లోకేష్ పాదయాత్ర సందర్భంగా గన్నవరంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో టీడీపీ నేతలు చేసిన ప్రసంగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై విడివిడిగా కేసులు నమోదు చేశారు. రంగుల రాణి రోజా మేకప్ చూస్తే రాత్రులు కూడా భయమేస్తుందంటూ అంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలతో పాటు ముఖ్యమంత్రిని ఆర్ధిక ఉగ్రవాది, సైకో, ధన పిశాచి, పనికిమాలినవాడు అంటూ విమర్శలు చేశారని కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153a, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు కాగా.. బుద్దా వెంకన్నపై 153, 153a, 505(2), 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. సభా వేదిక నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో పేర్ని నాని ఫిర్యాదు చేశారు. Also Read: తెలంగాణ టూర్ ప్యాకేజిని ప్రకటించిన ఐఆర్సీటీసీ..ప్యాకేజ్ రేట్ ఎంత..?ఎలా బుక్ చేయాలంటే!! #ganavaram #perni-nani #yuvagalam-padayatra #lokesh-yuvagalam #tdp-leaders #yuvagalam #lokesh #cases-against-tdp-leaders #police-cases మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి