Lokesh Yuvagalam: రేపటి నుంచి మళ్లీ లోకేశ్ యువగళం పాదయాత్ర... అరెస్ట్ చేస్తే రంగంలోకి బ్రాహ్మణి?
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 8.25గంటలకు లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవ్వాల్సి ఉంది. ఈ తరుణంలో పాదయాత్ర మరోవారం రోజుల పాటు వాయిదా వేయాలని టీడీపీ నేతలు కోరినట్లు సమాచారం. వచ్చేనెల 3వ తేదీ నుంచి యువగళం పాదయాత్ర చేట్టాలని కోరారని తెలుస్తోంది. ఒకవేళ లోకేశ్ ను అరెస్టు చేస్తే...బ్రాహ్మణి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పాదయాత్ర గురించి బ్రాహ్మణికి కుటుంబ సభ్యులు అన్ని విషయాలను వివరించారట.