Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ అప్పుడేనా.. !

2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 14న లేదా 15న ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 2019లో ఏడు దశల్లో ఎలక్షన్లు నిర్వహించినట్లుగానే.. ఈసారి కూడా ఎన్నికలు అదే తరహాలో నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి.

New Update
Andhra Pradesh: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..

Lok Sabha Elections 2024 Schedule : పార్లమెంటు ఎన్నికలు సమీస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వస్తుందా అని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) మార్చి 14న లేదా 15న ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ విషయాన్ని పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 2019లో ఏడు దశల్లో ఎలక్షన్లు నిర్వహించినట్లుగానే.. ఈసారి కూడా ఎన్నికలు అదే తరహాలో నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి.

Also Read: నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్.. ఎక్కడంటే

మార్చి 14 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి ?

పలు మీడియా కథనాల ప్రకారం మార్చి 14 నుంచి మోడల్ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక లోక్‌సభ మొదటిదశ ఎన్నికల ఓటింగ్ ఏప్రిల్‌ రెండో వారంలో జరిగే ఛాన్స్ ఉంది. ఇటీవల ప్రధాని మోదీ కూడా ఓ సభలో మాట్లాడుతూ త్వరలోనే ఈ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లోనే నగరా మోగనుంది.

400 సీట్లు లక్ష్యం ఇండియా కూటమి 

ఇదిలాఉండగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు దశల్లో ఎలక్షన్లు జరగగా.. అందులో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లకు మాత్రమే పరిమితమైపోయింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధించాలని టార్గెట్‌ పెట్టుకుంది. అలాగే ఎన్డీయేతో కలిపి మొత్తం 400 సీట్లు గెలిచేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల పార్లమెంట్‌లో ప్రధాని మోదీ.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లైనా రావాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

కష్టాల్లో ఇండియా కూటమి 

మరోవైపు మోదీ సర్కార్‌ను గద్దె దించే దిశగా ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటికే ఆ కూటమి నుంచి.. మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్, నితీష్‌ కుమార్ లాంటి కీలక నేతలు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇండియా కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే దేశ ప్రజలు రానున్న ఎన్నికల్లో మరి ఏ పార్టీకి కేంద్రంలో అధికార పగ్గాలు అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచిచూడాల్సిందే.

Also read: 10 లక్షల ఉద్యోగాలే ప్రధానాంశంగా కాంగ్రెస్ మేనిఫెస్టో..రాహుల్

Advertisment
Advertisment
తాజా కథనాలు