Bengaluru: వేసవి కాలం వచ్చిందంటే చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఉంటుంది. సమయానికి నీళ్లు లేక ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయితే బెంగళూరులోని కొన్ని ప్రాంతాల ప్రజలు వేసవి పూర్తిస్థాయిలో రాకముందే.. నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేఫథ్యంలో ఓ హౌసింగ్ సోసైటీ.. నీరు వృథా చేస్తే ఏకంగా రూ.5 వేల ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కనకపుర, యల్హంక, వైట్‌ఫీల్ట్ ప్రాంతాల్లో ఉండే స్థానికులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో నివసించేవారు ఎవరైనా ఎక్కువగా నీటిని వినియోగిస్తే.. వాళ్లకి రూ.5వేలు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా సెక్యురిటీని కూడా నియమించనున్నట్లు చెప్పింది.
పూర్తిగా చదవండి..Water Wastage: నీరు వృథా చేస్తే రూ.5 వేలు ఫైన్.. ఎక్కడంటే
బెంగళూరులోని కనకపుర, యల్హంక, వైట్‌ఫీల్ట్ ప్రాంతాల్లో ఉండే స్థానికులు వేసవి పూర్తిస్థాయి రాకముందే నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీరు వృథా చేసిన వారికి రూ.5 వేలు ఫైన్ విధిస్తామని ఓ హౌసింగ్ సొసైటీ హెచ్చరించింది.
Translate this News: