Rahul Gandhi on Congress Manifesto: కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) 51వ రోజుకు చేరుకుంది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న రాహుల్ తిరిగి మధ్యప్రదేశ్‌లోని శివపురి నుంచి న్యాయ్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగాన్ని ఎత్తిచూపిన రాహుల్ గాంధీ..ఉద్యోగాల విషయంలో బీజేపీని (BJP) దుయ్యబట్టారు. మోదీ ప్రభుత్వం పోస్టుల భర్తీకి తలుపులు మూసేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. కొలువుల తలుపులు తెరుస్తామన్నారు. మొత్తం 10 లక్షల ఉద్యోగాలు (10 Lakh Jobs) భర్తీ చేస్తామన్నారు. ఈ ఉద్యోగాలను గత పదేళ్లుగా … నరేంద్ర మోదీ సర్కారు భర్తీ చేయకుండా ఉంచిందన్నారు. కేంద్రంలోని 15 విభాగాలలో దాదాపు 30% పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని (Narendra Modi) ప్రశ్నించారు. పది లక్షల ఉద్యోగాల భర్తీ విషయాన్ని మేనిఫెస్టోలో పెడుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ పోస్టులను కొత్త వారితో భర్తీ చేయకుండా సమయాన్ని సాగదీస్తున్నదని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..National: 10 లక్షల ఉద్యోగాలే ప్రధానాంశంగా కాంగ్రెస్ మేనిఫెస్టో..రాహుల్ హామీ
లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పది లక్షల ఉద్యోగాల భర్తీ విషయాన్ని మేనిఫెస్టోలో పెడుతామన్నారు. భారత్ జోడో యాత్రలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
Translate this News: