MP Bandi Sanjay: బీఆర్ఎస్ మంత్రులు బీజేపీలోకి.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ మంత్రులు బీజేపీలో చేరుతామని తన వద్దకు వచ్చారని బండి సంజయ్ అన్నారు. వాళ్ళను కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రచారం చేశారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు.

Bandi Sanjay: ఏం సాధించారని సంబరాలు?.. డ్రామాలు ఆపండి: బండి ఫైర్
New Update

MP Bandi Sanjay: ఎల్బీస్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్ అన్న పేరు స్మరిస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు గజగజ వణుకుతున్నారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాముడి పేరు ఎత్తే అర్హత ఉందా? అని నిలదీశారు. ఈ ఎన్నికల్లో తాము రాముడి పేరుతో వస్తాం.. కావాలంటే మీరు బాబర్ పేరు చెప్పి రండి అని రెండు పార్టీలకు సవాల్ విసిరారు.

ALSO READ: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

రాముడు మాకు మాత్రమే దేవుడు...

రాముడు మీకు మాత్రమే దేవుడా? .. అని కొందరు ప్రశ్నిస్తున్నారని అన్నారు బండి సంజయ్. అవును, రాముడు తమకు మాత్రమే దేవుడని అన్నారు. చస్తామని తెలిసినా అయోధ్య రాముడి ఆలయం నిర్మాణం కోసం వెళ్లిన వారు బీజేపీ నేతలని పేర్కొన్నారు. అయోధ్య రాముడి గుడి నిర్మాణం కోసం కాంగ్రెస్ నేతలు వచ్చారా?, బీఆర్ఎస్ నేతలు వచ్చారా?, కమ్యూనిస్టు నాయకులు వచ్చారా? అని ప్రశ్నించారు. తమకు కాకుండా రాముడి పేరు చెప్పే అర్హత ఎవరికి ఉంది? అని అన్నారు.

కాంగ్రెస్ కు వార్నింగ్..

బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ.. మరి కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలి అని అన్నారు బండి సంజయ్. 100 రోజులు అయిపోతోంది.. 6 గ్యారెంటీలు ఇంకా ఎప్పుడు అమలు చేస్తారు? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారో చూస్తాం అని అన్నారు. పేపర్ లీక్ జరిగితే.. కొట్లాడింది బీజేపీ నేతలు అని గుర్తు చేశారు. 6 గ్యారెంటీల్లో అరకొర పథకాలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ కుంటుంబాలను పక్కన పెట్టి నిజాం, రజాకార్ల, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడాం అని.. కానీ ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని అన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా.. బీజేపీ పోరాటం తమకు అధికారాన్ని తెచ్చి పెట్టిందని చెప్పుకుంటున్నారని అన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి అధికారం ఇవ్వాలని ఆయన కోరారు.

కేసీఆర్ వల్ల సర్పంచులు బలి..

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు బండి సంజయ్. కేసీఆర్ వల్ల సర్పంచ్ ల బతుకు దుర్భరమైందని అన్నారు. ఈ తప్పు మళ్ళీ జరగొద్దు అంటే.. ఆ ఎన్నికల్లో కూడా బీజేపీ నేతలకు ఓట్లు వేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని నమ్మించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందని అన్నారు. అయితే.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ మంత్రులు బీజేపీలో చేరుతామని తన వద్దకు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. వాళ్ళను కాపాడుకునేందుకు కేసీఆర్ బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రచారం చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఢిల్లీలో లేదు.. గల్లీలో లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు చేస్తే మూసీలో వేసినట్టే అని అన్నారు

#kcr #congress #bjp #lok-sabha-elections #brs-party #mp-bandi-sanjay
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe