కేసీఆర్ మిస్సింగ్.. ఏ క్షణమైనా బీఆర్ఎస్ చీలే ప్రమాదం: బండి సంజయ్ సంచలన వాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ ఏ క్షణమైనా నిట్టనిలువునా చీలే ప్రమాదముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కొడుకును సీఎంగా చేయాలనే విషయాన్ని ప్రధాని మోదీ బయటపెట్టడంతో ఆ కుటుంబంలో చిచ్చు రగిలిందన్నారు. తన సడ్డకుడి కొడుకును కేసీఆర్ తన ఇంటికి కూడా రానీయడం లేదన్నారు. బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోందని, ట్విట్టర్ టిల్లు (కేటీఆర్) నాయకత్వంలో ఎన్నికల్లోకి వెళితే… డిపాజిట్లు కూడా రావనే భయం పట్టుకుందంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు. బుధవారం కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు.