/rtv/media/media_files/2025/04/19/EcxZ7n0Y4HJdtB1fhIG0.jpg)
world liver day 2025
World Liver Day: కాలేయ వ్యాధుల గురించి అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏడాది ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాలేయ వ్యాధులను నివారించడానికి సహాయపడే జీవనశైలిని, ఆహారపు అలవాట్లను ఎంపిక చేసుకోవాలని ప్రజలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది కాలేయ దినోత్సవ థీమ్ ని 'ఆహారమే ఔషధం' గా నిర్ణయించారు. సమతుల్య ఆహరం, పోషకాల ప్రాముఖ్యత గురించి ఇది చెబుతుంది.
మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది శరీరంలో విష పదార్థాలను తొలగించడం, రక్తాన్ని ఫిల్టర్ చేయడం, పోషకాలను ప్రాసెస్ చేయడం, జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆల్కహాల్ తో పాటు, చెడు ఆహారపు అలవాట్లు కాలేయ వ్యాధులకు అతిపెద్ద కారణం. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా అనేక వ్యాధులకు దారితీస్తాయి.
ఇది కూడా చదవండి: డయాబెటిస్ ఉన్నవారు చెరకు రసం తాగవచ్చా? అది సురక్షితమో కాదో తెలుసుకోండి
కాలేయానికి హానీ కలిగించే ఆహారాలు
- ఆల్కహాల్
- ప్రాసెస్డ్ ఫుడ్స్
- అధిక కొవ్వు పదార్ధాలు
- షుగర్స్
- ప్యాక్ చేసిన ఆహారాలు
- అధిక ఉప్పు
Also Read: Jagamerigina Satyam: తెలంగాణ మట్టి వాసనను గుర్తుచేసేలా మరో సినిమా.. రవితేజ మేనల్లుడు హీరోగా!
ఈ ఆహారాలు కాలేయానికి స్నేహితులు
- ఆకుకూరలు, కూరగాయలు
- నట్స్
- ఆలివ్ ఆయిల్
- యాపిల్స్
- బ్లూబెర్రీస్
- బీట్‌రూట్
- గ్రీన్ టీ
Also Read : నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా... రేవంత్ సర్కార్ పై తిరగబడ్డ స్మితా సభర్వాల్!
కాలేయ వ్యాధి లక్షణాలు
- ఎల్లప్పుడూ అలసటగా అనిపించడం
- కాళ్ళు, కళ్ళు, చేతులు పసుపు వర్ణంలోకి మారడం
- కుడి వైపు ఉదర భాగంలో నొప్పి
- ముదురు రంగులో మూత్రం
- వికారం, వాంతులు.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోండి.
Also Read : ట్విస్ట్ అదిరింది.. నితిన్-వేణు సినిమాలో పెళ్లైన స్టార్ హీరోయిన్!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
latest-news | telugu-news | life-style | world-liver-day