Smita Sabharwal : నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేస్తున్నారా... రేవంత్ సర్కార్ పై తిరగబడ్డ స్మితా సభర్వాల్‌!

గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్‌ స్పందించారు. పోలీసులకు పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. తాను రీ పోస్టు చేసినట్లే 2వేల మంది చేశారని వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.

New Update
smita counter

smita counter

 కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే,   సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఆమె షేర్ చేయడమే ఇందుకు కారణం. దీంతో ఆమెకు బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశార పోలీసులు. 

అయితే తాజాగా ఆ నోటీసులపై స్మితా సభర్వాల్ స్పందించారు. ఈ మేరకు ఆమె సంచలన కామెంట్స్ చేశారు.  పోలీసులకు తాను పూర్తిగా సహకరించినట్లు  స్మితా సభర్వాల్ చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లుగా వెల్లడించారు. తాను రీ పోస్టు చేసినట్లే  సోషల్ మీడియాలో దాదాపుగా 2వేల మంది చేశారు. మరి వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటున్నారా అని ఆమె ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా? అని స్మితా సభర్వాల్‌ నిలదీశారు. 

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఏఐ వీడియోలు, చిత్రాల ద్వారా సోషల్ మీడియాలో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాలు నుంచి సమాచారం అందింది. ఈ క్రమంలో ఫేక్ ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఎక్స్ వేదికగా  స్మితా సబర్వాల్ చేసిన రీ పోస్టుకు గానూ పోలీసులు నోటీసులు అందించారు. 

Also read:   ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి ఇదేం పనిరా.. మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు