/rtv/media/media_files/2025/10/28/skin-care-2025-10-28-08-29-43.jpg)
Skin care
అందంగా కనిపించడానికి అమ్మాయిలు సకల ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా శీతాకాలంలో అయితే చెప్పక్కర్లేదు. చల్లని, వేడి గాలుల వల్ల చర్మం తొందరగా పొడిబారుతుంది. దీంతో చర్మంపై పగుళ్లు వచ్చి స్కిన్ డ్రై అవుతుంది. అలాగే కాస్త నల్లగా కూడా చర్మం మారుతుంది. అయితే శీతాకాలంలో చర్మం డ్యామేజ్ కాకుండా ప్రకాశవంతంగా మెరిసిపోవాలంటే తప్పకుండా ఈ ఏడు చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం ఓసారి చదివేయండి.
ఇది కూడా చూడండి: Health Tips: మోషన్ ఇర్రెగ్యులర్‌గా ఉందా..? నిపుణుల సలహాలు.. పరిష్కార మార్గాలు తెలుసుకోండి!!
నీరు తాగాలి
చలికాలంలో దాహం వేయకపోయినా కూడా వాటర్ ఎక్కువగా తాగుతుండాలి. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్‌గా ఉంటుంది. చర్మం కూడా గాలికి పొడిబారకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఏ సీజన్‌లో అయినా చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా బాడీకి సరిపడా వాటర్ తాగాలని నిపుణులు చెబుతున్నారు.
మాయిశ్చరైజర్
శీతాకాలంలో తప్పకుండా మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. లేకపోతే చర్మం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే కెమికల్స్ ఉండే మాయిశ్చరైజర్స్ కాకుండా నేచురల్‌గా ఉండే వాటిని ఉపయోగించడం మంచిదని నిపుణులు అంటున్నారు.
తేనెతో ప్యాక్
ముఖానికి తేనె ప్యాక్ వేసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. కాఫీ విత్ తేనె, పెరుగు విత్ తేనె వంటి ఫేస్ ప్యాక్స్ వేయడం వల్ల చర్మం పొడిగా మారదు. అయితే ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా మెరిసిపోతుందని నిపుణులు అంటున్నారు.
నూనె
ఈ సీజన్‌లో స్నానం చేసే ముందు చర్మానికి ఆలివ్, బాదం, కొబ్బరి, నువ్వుల నూనెలో ఏదో ఒకటి రాసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. దీనివల్ల చర్మం అసలు పొడిబారకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రోజ్ వాటర్
చర్మానికి రోజ్ వాటర్ ఒక క్లీనర్‌గా పనిచేస్తుంది. దీన్ని ముఖానికి రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు యూజ్ చేయడం వల్ల ఫేస్ ఎంతో గ్లోగా ఉంటుంది.
కలబంద జెల్
రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ సీజన్‌లో కలబంద జెల్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మెరుస్తుందని, ఎంతో గ్లోగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
మసాజ్
చర్మానికి అప్పుడప్పుడు చలికాలంలో నెమ్మదిగా మసాజ్ చేయాలి. దీనివల్ల చర్మం పగుళ్లు రాకుండా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
Follow Us