Winter Season: ఈ సీజన్‌లో వేడి నీళ్లతో తలస్నానం చేస్తున్నారా.. ఎంతో ప్రమాదమో తెలిస్తే ఇంకోసారి దీని జోలికి పోరు!

శీతాకాలంలో వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. జుట్టు బలహీన పడి రాలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాగా వేడిగా ఉన్న నీరు కాకుండా గోరువెచ్చగా ఉండే నీటితో తలస్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.

New Update
Hot water

Hot water

శీతాకాలంలో చలి తీవ్రత అధికంగా ఉండటం వల్ల చాలా మంది వేడి నీటి స్నానం చేస్తుంటారు. కేవలం బాడీకి మాత్రమే కాకుండా తలకు కూడా స్నానం చేస్తారు. అయితే చల్లని నీటి కంటే హాట్ వాటర్ ఈ కాలంలో ఎంతో రిలీఫ్ అనిపిస్తుంది. కానీ తలకు స్నానం చేయడం వల్ల సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి నీటి తలస్నానం వల్ల జుట్టు అంతా కూడా దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. అయితే దీనివల్ల ఎంత ప్రమాదమో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Health Tips: ఉదయం లేచిన వెంటనే గొంతు ఎండిపోతున్నట్లు అనిపిస్తుందా? అయితే మీకు ఈ 6 సమస్యలు ఉన్నట్లే!

జుట్టు బాగా దెబ్బతింటుందని..

వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల సహజ నూనెలు తొలగిపోతాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల మాడు, జుట్టు రెండు కూడా డ్యామేజ్ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే బాగా వేడిగా ఉన్న నీటిని కాకుండా గోరువెచ్చగా ఉన్న నీటిని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. బాగా వేడిగా నీరు ఉంటే సెబమ్ పూర్తిగా తొలగిపోతుంది. దీంతో జుట్టు మొత్తం డ్రైగా మారుతుంది. కుదుళ్లు బాగా బలహీన పడతాయి. దీనివల్ల దురద, డాండ్రఫ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే జుట్టుకు కలర్ వేసుకునే వారికి అయితే ఈ వేడి నీటి వల్ల ఎఫెక్ట్ బాగా ఉంటుంది.

ఇది కూడా చూడండి: Winter Season: శీతాకాలంలో స్కిన్ విషయంలో ఈ టిప్స్ పాటిస్తే.. సంతూర్ మమ్మీలా మీరు కనిపించడం ఖాయం!

వేడి నీళ్లు జుట్టులో ఉండే కలర్ పిగ్మెంట్స్‌ను త్వరగా వాష్ చేస్తాయి. దీంతో కలర్ ఈజీగా తగ్గిపోతుంది. దీనివల్ల జుట్టు పాలిపోయినట్లు కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే జుట్టు కుదుళ్లను కూడా బాగా బలహీన పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటి వల్ల స్కాల్ప్‌లోని రక్త నాళాలు దగ్గర రక్త ప్రసరణ సరిగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఉండదు. దీనివల్ల జుట్టు పొడిబారి బాగా బలహీన పడుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో జుట్టు తొందరగా రాలిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు వేడి నీటితో తలస్నానం చేయకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొందరు తలస్నానం తర్వాత గట్టిగా తుడుస్తుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు చిట్లిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. కాబట్టి సాఫ్ట్ కాటన్ టవల్‌తో జుట్టును సున్నితంగా తుడవాలని నిపుణులు  చెబుతున్నారు. దీనివల్ల జుట్టు రాలిపోకుండా ఉంటుందని అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు